బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ వీర్ సింగ్ - దీపిక పదుకునేలు వివాహం చేసుకుని నేటికి పది రోజులు అయ్యింది. సామాన్యులు వివాహం చేసుకుంటేనే కనీసం నెల రోజుల పాటు హంగామా - ఏవో కార్యక్రమాలు ఉంటూనే ఉంటుంది. ఇక సెలబ్రెటీల వివాహ వేడుక అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి - హనీమూన్ - పార్టీలు - ఫంక్షన్ లు - దేవాలయాలు తిరగడం ఇలా రకరకాలుగా ఉంటాయి. రణ్ వీర్ సింగ్ - దీపిక పదుకునేలు కూడా ఒక నెల రోజులు సినిమాలను పక్కన పెట్టి పెళ్లి - తదనంతర కార్యక్రమాల్లో హడావుడిగా ఉంటారని అంతా భావించారు. కాని షాకింగ్ గా పెళ్లి అయ్యి పది రోజులు అయ్యిందో కాలేదో అప్పుడే దీపిక పదుకునే చేయి వదిలేసి రణ్ వీర్ సింగ్ ‘సింబ’ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
తెలుగు సూపర్ హిట్ మూవీ ‘టెంపర్’ కు రీమేక్ గా ‘సింబ’ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. కరణ్ జోహార్ ప్రొడక్షన్స్ లో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంను డిసెంబర్ 28న విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉన్న కారణంగా పెళ్లి అయ్యి పది రోజులే అయినా అప్పుడే షూటింగ్ లో రణ్ వీర్ పాల్గొంటున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో రణ్ వీర్ ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. సినిమా అనుకున్న సమయంకు విడుదల కాకుంటే నిర్మాతతో పాటు అంతా కూడా ఎఫెక్ట్ అవుతారు. అందుకే రణ్ వీర్ తన బ్యాలన్స్ షూటింగ్ ను ముగించే పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన టెంపర్ చిత్రంను రణ్ వీర్ ఇష్ట పడి చేస్తున్నాడు. నటకు స్కోప్ ఉండే పాత్ర అవ్వడంతో తాను ఈ చిత్రంను ఎంపిక చేసుకున్నట్లుగా రణ్ వీర్ గతంలో చెప్పుకొచ్చాడు. ఇష్టపడి కూడా చేస్తున్నాడు కనుక కొత్తగా పెళ్లి అయిన భార్యను వదిలి వచ్చి మరీ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. వచ్చే నెల మొదటి వారంకు చిత్రీకరణ పూర్తి కానున్నట్లుగా తెలుస్తోంది. ‘సింబ’ను పూర్తి చేసి విదేశాలకు ఈ కొత్త జంట హనీమూన్ కు వెళ్లే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల వారు చెబుతున్నారు.