​మెగాస్టార్ కి రిప్లయ్ ఇవ్వలేదో!!!

Update: 2017-07-15 09:33 GMT
మెగా స్టార్ అమితాబ్ బచ్చన్  సోషల్ మీడియాలో కొత్తగా వస్తున్న స్టార్స్ కన్నా చాల చురుకుగా ఉంటాడు. తనకు ఏం చెప్పాలి అనిపించినా దేనిగురించైనా చర్చించాలి అనిపించిన వెంటనే తన బ్లాగ్ లోనో లేకపోతే ట్విటర్ లోనో అభిప్రాయాలును చెబుతూ ఉంటాడు. అయితే ఈ ఇండియన్ మెగాస్టార్  తన కాలపు నటులుతోనే కాదు ఇప్పుడు ఇప్పుడు స్టార్లు అవుతున్న వాళ్ళ అందరితోను స్నేహంగా ఉంటాడు. ఎవరి సినిమానైనా మంచిగా అనిపిస్తే వెంటనే వారికి తన శుభాకాంక్షలు తెలియపరుస్తాడు. అలానే ఏ విజయం వచ్చిన వాళ్ళకి తన శుభాకాంక్షలు చెప్పడం మరిచిపోడు.

అమితాబ్ బచ్చన్కు అందరి పుట్టిన రోజులు గుర్తుకు ఉంటాయి. ఈ మధ్య యంగ్ హీరో రణవీర్ సింగ్ తన 32వ పుట్టినరోజు జూలై 6 న జరుపుకున్నాడు. ఆ రోజు అందరిలాగానే బిగ్ బి కూడా తన శుభాకాంక్షలు పంపాడు కానీ దానికి స్పందన రాకపోవడంతో రణవీర్ను ట్విటర్లో ఇలా నిలదీశాడు “హే నేను నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు పంపాను అందిందా లేదా  అసలు చూశావా ?”అని అన్నాడు. దాని మన కుర్ర హీరో కూడా వినయంగా సమాధానపరిచాడు బిగ్ బి కి “ఆహా చూశాను సర్ నేను అందరికి తిరిగి రిప్లై ఇచ్చాను. ఇప్పుడే అందరికి నా రిప్లై అందిందో లేదో చూసుకున్న. నిజానికి నాకు మొదట చెప్పింది కూడా మీరే. నా లాంటి చిన్నవాడిని కూడా మీరు గుర్తు పెట్టుకున్న మీది చాల పెద్ద మనసు సర్ అని అన్నాడు. నేను ఉన్నాను అని మీకు గుర్తుండటం నిజంగా నా అదృష్టం సర్'' అని చెప్పాడు.

ఇలానే అమితాబ్ బచ్చన్ ఒకసారి సోనమ్ కపూర్ పుట్టిన రోజుకు తన శుభాకాంక్షలు పంపితే అటునుండి కూడా లేటుగా స్పందించింది  సోనమ్ దానితో మన బిగ్ బి “ఓయ్ అందరికి చెప్పావు సరే నా సంగతి ఏంటి అమితాబ్ బచ్చన్ ఇక్కడ'' అని ట్వీట్ చేశాడు. వెంటనే మన బ్యూటీ తేరుకొని సోరి చెప్పింది. అమితాబ్ అంతటి వాడే మనకు శుభాకాంక్షలు చెబితే వీళ్ళకు తిరిగి చెప్పడానికి ఏమైంది అబ్బా.  అమితాబ్ కు మన సంస్కృతి అన్న భారత దేశ సాంప్రదాయాలు అన్న అమితమైన మక్కువ. అందుకే ఇలా అందరినీ విష్ చేయడం కూడా ఒక సాంప్రదాయం అంటుంటాడు ఆయన.
Tags:    

Similar News