మిస్ యూ దీపికా!!

Update: 2017-06-04 09:48 GMT
బాలీవుడ్ ప్రేమజంటల్లో రణ్ వీర్ సింగ్ దీపినా పదుకునే పేర్లు ముందుంటాయి. వీరిద్దరూ తమ లవ్ గురించి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా వీరిద్దరూ కలిసి చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ చాలా సార్లు కనిపించారు. వీరిద్దరూ విడిపోయారని ఎన్నిసార్లు రూమర్లు వచ్చాయో... తిరిగి కలిసిపోయారని అన్ని రూమర్లూ వచ్చాయి. ఎన్ని రూమర్లు వచ్చినా వీరిద్దరూ తమ రిలేషన్ షిప్ పై ఎప్పుడూ ఎక్కడా పెదవి విప్పలేదు. అలాగని వారి రిలేషన్ షిప్ ను రహస్యంగానూ ఉంచలేదు.

ఈమధ్య వీరిద్దరూ బాగా బిజీ అయిపోవడంతో అస్సలు కలవడం కుదరడం లేదు. తాజాగా దీపిక ఫారిన్ టూర్ వెళ్లింది. అక్కడ తన ఫొటో ఒకటి ఇన్  స్టాగ్రామ్ లో పెట్టింది. చాలాకాలం నుంచి దూరంగా ఉన్నాడేమో... రణ్ వీర్ వెంటనే రెస్పాండయ్యాడు. ఆమెను మిస్సవుతున్నానంటూ రిప్లయ్ ఇచ్చాడు. పక్కనే కిస్ తో కూడిన ఎమోషన్ ఐకాన్ పెట్టి తన ఫీలింగ్ ఎక్స్ ప్రెస్  చేశాడు. రణ్ వీర్ సింగ్ దీపికాల కాంబినేషన్ రామ్-లీలా - బాజీరావ్ మస్తానీ సినిమాలు వచ్చాయి. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో ఈ రెండు సినిమాలు తెరకెక్కాయి. ఇదే జంటతో భన్సాలీ ముచ్చటగా మూడో సినిమా పద్మావతి సినిమా తీస్తున్నాడు.

ఇదే సమయంలో దీపిక ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ సినిమాతో హాలీవుడ్ లో అడుగు పెట్టింది. అప్పటి నుంచి ఆమెకు ఫారిన్ టూర్లు ఎక్కువయ్యాయి. రణ్ వీర్ కూడా షూటింగుల్లో బాగా బిజీ అయిపోయాడు. దీంతో వీరిద్దరూ కలిసి తిరిగేందుకు కానీ, నటించేందుకు కానీ సమయం దొరకడం లేదు. భన్సాలీ పద్మావతి షూటింగ్ షెడ్యూల్స్ కూడా ఇద్దరివీ వేరేవేరుగా ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News