నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే గోల. జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వేదికెక్కి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయిపోతోంది. కేవలం ఫేస్ బుక్ ద్వారానే ఈ వీడియోను 7 లక్షల మందికి పైగా చూడటం విశేషం. ఫరూక్ 78 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తడబాటు లేకుండా 30 ఏళ్ల రణ్ వీర్ సింగ్ తో కలిసి స్టెప్పులు ఇరగదీయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్డీటీవీ ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుల కార్యక్రమంలో భాగంగా.. దిల్ దడ్కనే దో - బాజీరావ్ మస్తానీ సినిమాల్లో పెర్ఫామెన్స్ కు గాను ‘ఎంటర్ టైనర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకున్నాడు రణ్ వీర్.
రణ్వీర్ కు అవార్డు అందజేయడం కోసం ఫరూక్ ను వేదిక మీదికి పిలిచారు. ఈ సందర్భంగా ‘బాజీరావ్ మస్తానీ’లోని మల్హరి పాటను ప్లే చేశారు. ఐతే మెట్లు ఎక్కి పైకి వస్తూనే ఆ ట్యూన్ కు తగ్గట్లు అదిరిపోయే స్టెప్పులేశారు ఫరూక్. ఊరికే అలా బాడీని కాస్త ఊపేసి వెళ్లిపోకుండా ప్రొఫెషనల్ డ్యాన్సర్ తరహాలో ఆయన వేసిన స్టెప్పులకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మీరిలా డ్యాన్సులేస్తే మేమంతా ఏమైపోవాలి.. మీరు యాక్టింగ్ లోకి వస్తే అమితాబ్ బచ్చన్ ఇబ్బందుల్లో పడతారేమో అని రణ్వీర్ చమత్కరించగా.. ‘‘నాకూ యాక్టింగ్ చేయాలనే ఆసక్తి ఉంది. కానీ దాని కోసం తర్వాతి జన్మ వరకు ఎదురు చూడాలి’’ అని తనదైన శైలిలో జోక్ పేల్చారు ఫరూక్.