రణ్‌ వీర్‌ '83' అప్‌ డేట్‌

Update: 2019-01-23 10:47 GMT
బాలీవుడ్‌ లో ఈమద్య కాలంలో స్పోర్ట్స్‌ నేపథ్యంలో వరుసగా చిత్రాలు వస్తున్న విషయం తెల్సిందే. తాజాగా రణ్‌ వీర్‌ సింగ్‌ హీరోగా '83' అనే క్రికెట్‌ నేపథ్యం చిత్రం తెరకెక్కబోతుంది. 1983వ సంవత్సరంలో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో ఇండియా ప్రపంచ కప్‌ గెలుచుకున్న విషయం తెల్సిందే. ఆ నేపథ్యంలో సినిమాను చిత్రీకరించబోతున్నారు. కపిల్‌ దేవ్‌ పాత్రను రణ్‌ వీర్‌ సింగ్‌ పోషిస్తుండగా, ఈ చిత్రానికి కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించబోతున్నాడు.

ప్రస్తుతం ముంబయిలో రణ్‌ వీర్‌ సింగ్‌ క్రికెట్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది అంటే 2020వ సంవత్సరం ఏప్రిల్‌ 10వ తారీకున గుడ్‌ ఫ్రైడే సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా తేల్చి చెప్పారు. ఈ చిత్రంను కేవలం హిందీలో మాత్రమే కాకుండా తమిళం మరియు తెలుగులో కూడా తెరకెక్కించబోతున్నారు. మూడు భాషల్లో ఒకే సారి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కీలక పాత్రల్లో సౌత్‌ స్టార్స్‌ పలువురు ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.


Full View
Tags:    

Similar News