రకుల్‌ తర్వాత రష్మిక.. ఎందుకమ్మ కెలకడం?

Update: 2019-01-26 06:27 GMT
కొన్ని రోజుల క్రితం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వేసుకున్న డ్రస్‌ పై ఒక నెటిజన్‌ కామెంట్‌ చేయడంతో అతడి అమ్మను దూషిస్తూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అతడిని తిట్టిన విషయం తెల్సిందే. అతడు ఏదో కామెంట్‌ చేస్తే అతడి అమ్మను ఎందుకు అనడం అంటూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పైనే సోషల్‌ మీడియా జనాలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. చుట్టు తిరిగి ఆ వివాదం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పైకి రావడంతో ఆమె సైలెంట్‌ అయ్యింది. అలాంటి కామెంట్స్‌ కు స్పందించకుండా ఉండటం ఉత్తమం అంటూ అందరు సెలబ్రెటీలకు ఒక గుణపాఠంగా నిలిచింది. ఇప్పుడు రకుల్‌ తరహాలోనే రష్మిక టార్గెట్‌ అయ్యింది.

తాజాగా రష్మిక లంగా ఓణీ ధరించిన పిక్స్‌ ను పోస్ట్‌ చేసింది. ఆ ఫొటోలకు ఒక వ్యక్తి రష్మిక కన్నడ సినిమా పాటల యూట్యూబ్‌ వ్యూస్‌ రికార్డులు యూట్యూబ్‌ నిర్వాహకులు చూస్తే నవ్వుకుంటారు జాగ్రత్త అంటూ కామెంట్‌ చేశాడు. రష్మిక అభిమానులను ఉద్దేశించి కూడా సదరు వ్యక్తి కామెంట్‌ చేశాడు. దాంతో రష్మికకు కోపం వచ్చింది. నన్ను కామెంట్స్‌ చేసినా పర్వాలేదు పట్టించుకోను, కాని నా అభిమానులను అంటే మాత్రం నేను ఊరుకోను అంటూ సదరు నెటిజన్‌ కు గట్టి వార్నింగ్‌ ఇచ్చింది.

ఉన్న మాట అంటే ఇంత కోపం ఎందుకు, రికార్డులు అంటూ చెప్పుకుంటున్న వాటికి ఆధారాలున్నాయా అంటూ ప్రశ్నించాడు. దాంతో రష్మిక నా టైం వేస్ట్‌ చేయవద్దంటూ కౌంటర్‌ ఇచ్చింది. అలా ఇద్దరు కూడా సోషల్‌ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్స్‌ చేసుకున్నారు. చివరగా రష్మిక గుడ్‌ బై అంటూ చెప్పగా, అతడు మాత్రం ఛల్‌ హట్‌ అంటూ వివాదాన్ని ముగించాడు. ఒక నెటిజన్‌ తో మరీ ఇంతగా కామెంట్స్‌, కాంట్రవర్సీ అవసరమా అంటూ రష్మికనే కొందరు ప్రశ్నిస్తున్నారు. సెలబ్రెటీల గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటారు. వాటన్నింటిని పట్టించుకుని, కెలకడం వృదా సమయం అనే విషయం రష్మికకు ఇప్పటికైనా అర్థం అవ్వాలి.
Tags:    

Similar News