ఫోటోలతో కిక్కు ఇద్దామని..

Update: 2015-05-26 15:30 GMT
మాస్‌ మహరాజ్‌ రవితేజ కిక్కు మీద కిక్కిస్తున్నాడు. రాజాతో పాటు రాణీ కూడా అంతే కిక్కిస్తోంది. ఇదిగో ఇక్కడున్న ఫోటో చూస్తే ఆ సంగతి ఇట్టే అర్థమవుతోంది. ఇంతకాలం ప్రమోషన్‌ చేయకుండా ఆడియో రిలీజ్‌ తరువాత దూకుడు తగ్గించిన కిక్‌ 2 టీమ్‌ ఇప్పుడు ఇలా ఫోటోలతో హోరెత్తిస్తోంది.

కోట బురుజు మీద రాణీతో పాటు రాజా వేస్తున్న స్టెప్పు చూస్తుంటే యూత్‌ మత్తులో జోగిపోవడం ఖాయం. అంతేనా రాజాతో పోటీపడుతూ రాణీ రకూల్‌ వేస్తున్న స్టెప్పులు కూడా అంతే కిక్కిస్తున్నాయి. బంగారు వర్ణం మెరుపులతో పింకు రంగు పరికిణీలో ధగధగా మెరిసిపోతోంది. పైన కాంబినేషన్‌ టాప్‌.. మధ్యలో అందాల్ని తాకుతూ ఆ ఓణీ అంచె... అబ్బోస్‌ మాస్‌ కావాల్సినంత కిక్కిస్తోంది ఈ రూపం. అంతేనా మాస్‌ రాజా డ్రెస్‌ కూడా కాంబినేషన్‌తో మెరిసిపోతోంది. బంగారు రంగు షేర్వాణీలో నైజాం ప్రభువులా కనిపిస్తున్నాడు. కిక్‌ 2 ఈనెల 29న రిలీజవుతోంది. ఈలోగానే సినిమాలోని కొన్ని పోస్టర్లు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

రిలీజ్‌కి నెల ముందు నుంచే కిక్కు సంబరాలు మొదలయ్యాయి అనాలేమో. పోస్టర్లతో కిక్కు, పాటలతో కిక్కు, ఆడియోలో మాటలతో కిక్కు.. ఎటు చూసినా కిక్కో కిక్కు. మాస్‌కి కావాల్సినంత కిక్కు ఇవ్వడానికి థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు రాజా. హిట్‌ కొట్టి అటు నిర్మాత కళ్యాణ్‌రామ్‌కి కూడా ముందే చెప్పినట్టు వసూళ్ల కిక్కివ్వకపోయాడో...?!

Tags:    

Similar News