సభలు, సెల్ఫీలు కాదు.. స్వతంత్రమంటే

Update: 2015-08-15 11:14 GMT
ఇండిపెండెన్స్ డే... స్వతంత్రం వచ్చిన సందర్భంగా సెలబ్రేషన్స్... ఆగస్ట్ 15 సందర్భంగా మనం ఇవాళ బోలెడు సంబరాలు చూస్తున్నాం. ఢిల్లీ నుంచి మొదలై గల్లీ వరకూ... జెండా రెపరెపలాడించి.. కెమేరాలకు రెండు ఫోజులిచ్చి, వీలైతే నాలుగు సెల్ఫీలు తీసుకుని వెళ్లిపోతున్నారు. ఒక తరం కిందట ఆగస్ట్ 15 ప్రత్యేకత ఏంట్రా అబ్బాయ్ అని ప్రశ్నిస్తే... స్కూల్లో చాక్లెట్లు ఫ్రీగా ఇస్తారు అని చెప్పేవారని ఓ జోక్ ఉండేది. ఇప్పుడదే ప్రశ్న వేస్తే... ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి ఫోటోలు తీసుకున్నాం అని చెప్పినా చెప్పచ్చు. ఇది మన స్వతంత్ర భారతంలో... స్వాతంత్ర్య  పోరాటంపై ఉన్న అవగాహన. ఇప్పటికీ ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి తేడా తెలీని మహానుభావులు చాలామందే ఉన్నారు.

చదువురాని వాళ్లు పెద్దోళ్ల నుంచి నాలుగు ముక్కలు నేర్చుకుంటారు.కానీ విద్యాధికులమని చెప్పుకునే వారు తాము పుస్తకాల్లో చదివి బట్టీపట్టినవే లోకం అనుకోవడంతోటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. కానీ... అప్పటి పోరాటాన్ని కళ్లకు కట్టి, సమాజంలో ఎందరికో స్ఫూర్తిని రగిలించేందుకు సినిమా రంగంలో కొందరు ప్రయత్నించారు. కొన్ని దేశభక్తి చిత్రాలు జనాలకు చరిత్రకు చేరువ చేస్తే... మరికొన్ని మూవీలలో పాటల ద్వారా ఈ ప్రయత్నం జరిగింది. స్వతంత్రం వచ్చిన కొత్తల్లో మనదేశం(1949) పేరుతో ఎన్టీఆర్ సినిమా తీస్తే... 1974లో వచ్చిన అల్లూరి సీతారామరాజుగా కృష్ణ నటించారు. సర్దార్ పాపారాయుడు(1980), భారతీయుడు(1996)లలోనూ స్వతంత్రపోరాట చిత్రీకరణతో మనసుని, శరీరాన్ని కట్టిపడేశారు. దేశభక్తి కాన్సెప్ట్ తో వచ్చినవాటిలో రోజా(1992)ని ప్రముఖంగా చెప్పుకోవాలి. దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే చిత్ర రూపకర్తల దేశభక్తికి నిదర్శనంగా నిలిచిన ఈ సినిమాలను ఎంతమంది చూసి ఉంటారు? స్వతంత్రం గురించో, సినిమా రంగం దేశానికి చేసిన సేవ గురించో ఏమాత్రం తెలుసుకుని ఉంటారు?

చివరగా ఓమాట స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి...సంబరగానే సరిపోదోయ్ అన్నాడో మహాకవి. ఈ మాట ఇప్పటి సెల్ఫీ తరానికి సరిగ్గా సరిపోతుంది. అఫ్పటి చరిత్ర చదవరు. తెలుసుకోరు. ఇంటర్నెట్ లో వీడియోలు పెట్టి నాలుగు ముక్కలు మాట్లాడేసి... తెలుగు గురించి బాధపడేవారే తప్ప... దేశం గురించి తెలుసుకునే వాళ్లే కనిపించడం లేదు. న్యూఇయర్ కి, బర్త్ డేలకి పెట్టినట్లుగా.. ఫేసుబుక్కులో , ట్విట్టర్‌ లో సెల్ఫీలు పెట్టడం కాదు... దేశం గురించి కాస్త తెలుసుకోండి.. భారత దేశ ఔన్నత్యం గురించి బ్రెయిన్ కి ఎక్కించుకోండి... ప్రపంచానికి మన గురించి చాటే ప్రయత్నం చేయండి. ఒక్కమాటండీ.., స్వతంత్రం అంటే జెండా వందనం మాత్రమే కాదు... ఎంతో మంది తమ జీవితాలను పణంగా పెట్టి దక్కించుకున్న ధనం. కనీసం  వారి గురించి అణుమాత్రమైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలని మనసావాచా విన్నపం.
Tags:    

Similar News