స్టార్ కాస్ట్ లేని బిగ్ బాస్ 2 ఇప్పటికే చప్పగా సాగుతోంది. అప్పుడప్పుడు బిగ్ బాస్ పెట్టే గొడవల పుణ్యమా అని ఇప్పుడిప్పుడే ఈ షో మీద ఆసక్తి పెరుగుతోంది. అయితే.. బిగ్ బాస్ షో ను టీవీలో చూసే కంటే.. దాని తెర వెనుక జరుగుతున్న విషయాలు.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పే ముచ్చట్లను సోషల్ మీడియాలో తెగ చదివేస్తున్నారు.. చూసేస్తున్నారు.
రియాలిటీ షోలు అంటేనే సస్పెన్స్. అయితే.. బిగ్ బాస్ 2లో అది పూర్తిగా మిస్ అవుతోంది. బిగ్ బాస్ సీజన్ 1లో మొయింటైన్ అయిన సస్పెన్స్ ఈసారి మాత్రం కావట్లేదు. ఎలిమినేషన్ మొదలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వరకూ.. సెట్ లోపల ఏం జరుగుతోంది? బయట ఏం జరుగుతోంది? అన్న విషయాలు ఎప్పటికప్పుడు లీకుల రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి.
అంతేనా.. బిగ్ బాస్ షోకు సంబంధించి నిర్వాహకులు ఏమనుకుంటున్న వివరాలు కొన్ని పుకార్ల పేరుతో బయటకు వస్తున్నాయి. బయటకు వస్తున్న లీకులు నిజమవుతున్న నేపథ్యంలో.. పుకార్లు కూడా నిజమేనా? అన్న సందేహం కలిగేలా చేస్తున్నాయి.
ఏ వారానికి ఆ వారం ఎలిమినేట్ అయ్యే వారిని ముందే ఊహించటం.. సోషల్ మీడియాలో ఆ వివరాలు వైరల్ కావటం.. అచ్చు గుద్దినట్లే.. వీకెండ్‌లో అదే జరగటమే కాదు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పూజా రామచంద్రన్ రావటం వరకూ అన్ని విషయాలు ఎప్పటికప్పుడు షో కంటే రెండు.. మూడు రోజుల ముందే బయటకు వచ్చేస్తున్నాయి.
చివరకు నూతన్ నాయుడు.. శ్యామల రీఎంట్రీ మీదా న్యూస్ వచ్చేసింది.ఎందుకిలా? కోట్లాది రూపాయిల్ని పెట్టి భారీ ఎత్తున చేపడుతున్న ఈ షోకు సంబంధించిన వివరాలన్నీ లీకుల రూపంలో ఎందుకు బయటకు పొక్కుతున్నాయన్న దానిపై బిగ్ బాస్ నిర్వాహకులు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. లీకులకు ప్రధాన కారణంగా బిగ్ బాస్ సెట్ గా చెబుతున్నారు. సీజన్ 1లో బిగ్ బాస్ సెట్ ను పూణేకు వంద కిలోమీటర్ల దూరంలోని లోనావాలా అటవీ ప్రాంతంలో హౌస్ సెట్ వేసి తీశారు. ఈ కారణంగా కంటెస్టెంట్లను విమానాల్లో తీసుకెళ్లేవారు.
ఎలిమినేట్ అయ్యాక హైదరాబాద్‌కు తిరిగి రావాలన్నా ఒక రోజు పట్టేది. చివరకు కంటెంట్ మొదలు ఆ షోకు వాడిన కెమేరామెన్లు.. ఎడిటింగ్.. ఇతర సాంకేతిక నిపుణులు.. హౌస్ ను శుభ్రం చేసే వారు.. మేకప్ టీం.. హెయిర్ డ్రెస్సర్స్ అంతా స్థానికులు.. తెలుగు రాని వాళ్లే. దీంతో... వారికి సంబంధించిన సమాచారం బయటకు పొక్కేందుకు అవకాశమే లేకుండా పోయేది.
కానీ.. ఈసారి అందుకు భిన్నంగా హైదరాబాద్ నడిబొడ్డు లాంటి ప్లేస్ లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్ వేశారు. ఈ షోకు పని చేస్తున్న వారంతా తెలుగువారే. దీంతో.. కంటెస్టెంట్స్ తో పాటు.. అందరూ తెలుసు. దీంతో.. ఈ షో లీక్స్ ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి. అయితే.. ఈ లీక్స్ కు ప్రధానకారణమైన వారిని గుర్తించినట్లుగా చెబుతున్నారు. అయితే.. వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఏదోలా చేసి లీక్స్ ను అడ్డుకోవటానికి బిగ్ బాస్ నిర్వాహకులు తెగ ట్రై చేస్తున్నారట.