ఇండిపెండెన్స్ డే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కొత్త మీస కట్టు.. హెయిర్ స్టైల్.. లైట్ గా కనిపించే గెడ్డం.. కొత్తగా అనిపించే డ్రెసింగ్.. ఓవరాల్ గా చెర్రీ లుక్ ఇరగదీసేశాడు. నా శతృవే నా బలం అంటూ తగిలించిన ట్యాగ్ లైన్ కూడా ఆకట్టుకుంది. అయితే.. ఈ ఫస్ట్ లుక్ లో చెర్రీతో సమానంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మరో పాయింట్.. టైటిల్ లోగో డిజైన్.
కొంత కాలంగా వినిపిస్తున్న ధృవ అనే టైటిల్ నే కన్ఫాం చేస్తూ టైటిల్ లోగో ఉంది. కానీ ఆ ధృవ లెటరింగ్ కి వెనకాల 8 నెంబర్ ను ఎంబోజ్ చేశారు. అదే ఇప్పుడు సస్పెన్స్ గా మారిపోయింది. ఇప్పుడీ 8 కి అర్ధం ఏంటా అని ఆన్ లైన్ లో చాలామంది వెతికేసుకుంటున్నారు. చాలామంది నెటిజన్లు అయితే తమకు తోచిన అర్ధం చెప్పేసుకుంటున్నారు. ఇందులో చెర్రీ పోలీస్ ఆఫీసర్ గా నటించనుండడంతో.. అతని టీమ్ లో మొత్తం 8మంది ఉంటారనే మాట గట్టిగా వినిపిస్తోంది. అందుకే 8 అనే లెటర్ పెట్టారట. ఇక చెర్రీ పాత్ర డీల్ చేసే ఎనిమిదో కేస్ అని మరో డిస్కషన్ నడుస్తుంటే.. దర్శకుడు సురేందర్ రెడ్డికి ఇది ఎనిమిదో మూవీ కాబట్టి.. అలా ఎంబోజ్ చేశారని అంటున్నారు.
ఇందులో ఏదైనా వాస్తవం ఉందో లేదో చెప్పాలంటే చెర్రీ కానీ.. దర్శకుడు కానీ నోరు విప్పాలి. వాళ్లకు మాత్రం ఈ సీక్రెట్ విప్పే ఆలోచనేదీ ఉన్నట్లుగా కనిపించడం లేదు. సినిమా రిలీజ్ అయ్యేవరకూ ఈ సస్పెన్స్ ని మెయింటెయిన్ చేసేస్తారేమో!