రియా పై సుశాంత్ తండ్రి కంప్లైంట్ చేయడానికి కారణాలు ఇవే...!

Update: 2020-07-30 16:30 GMT
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని వచ్చినప్పటికీ.. బలవన్మరణం చేసుకునేలా ఎవరైనా ప్రేరేపించారా? సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న సుశాంత్ సూసైడ్ చేసుకోడానికి గల కారణాలను ఏమిటి? అని అందరి మదిలో ప్రశ్నలు మొదలయ్యాయి. దీనికి తోడు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సుశాంత్ సూసైడ్ పై అనేక అనుమానాలున్నాయని.. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసారు. ప్రస్తుతం సుశాంత్ మరణంపై ముంబై పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సుశాంత్‌ సూసైడ్ కేసులో పలువురు సినీ ప్రముఖులను అతనితో సన్నిహితంగా ఉండే వ్యక్తులను పోలీసులు విచారించారు. ఈ క్రమంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్‌ లో సుశాంత్‌ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మరో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. సుశాంత్ తండ్రి కంప్లైంట్ మేరకు పాట్నా పోలీసులు రియాతో పాటు మరో ఐదుగురి మీద పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఈ కేసుపై విచారణ జరిపేందుకు ప్రత్యేక పోలీసుల బృందాన్ని ముంబైకి పంపించారు. అయితే సుశాంత్ మరణం తర్వాత ఇన్ని రోజులుగా సైలెంటుగా ఉన్న అతని కుటుంబం ఇప్పుడు రియాపై కంప్లైంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

కాగా రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేయడానికి బలమైన కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే అంశాలను కేకే సింగ్ తన కంప్లైంట్ లో పేర్కొన్నట్లు సమాచారం. సుశాంత్ సింగ్ 2019‌కు ముందు ఎలాంటి డిప్రెషన్ కి కానీ ఇతర మానసిక సమస్యలతో కానీ బాధపడలేదు.. రియా చక్రవర్తితో రిలేషన్ పెట్టుకొన్న తర్వాతే సుశాంత్ డిప్రెషన్‌ కు గురయ్యాడనే అనుమానం కలుగుతోంది.. రియా చక్రవర్తితో పరిచయం తర్వాత సుశాంత్‌ కు ఏమైంది అనే విషయంపై కేకే సింగ్ అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఒకవేళ సుశాంత్ డిప్రెషన్ గురైతే కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు.. డిప్రెషన్ కి ట్రీట్మెంట్ తీసుకునే విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదు.. ఫ్యామిలీ మెంబర్స్ అనుమతి ఎందుకు తీసుకోలేదు అని ఆయన డౌట్ పడుతున్నారు. ఇక సుశాంత్ డిప్రెషన్‌ తగ్గించడానికి రియా ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించింది.. ఎలాంటి మెడిసిన్స్ ఇచ్చారో వెల్లడించాలి.. అలానే సుశాంత్ తో రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు అతను డిప్రెషన్ లో ఉన్నాడని తెలిసీ రియా అతడిని వదిలేసి ప్లాట్ నుంచి ఎందుకు వెళ్లిపోయింది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి 15 కోట్లు అజ్ఞాత వ్యక్తులకు ట్రాస్ఫర్ అయ్యాయి.. దాంట్లో గర్ల్ ఫ్రెండ్ రియాకి సంబంధం ఉండి ఉంటుంది అని కేకే సింగ్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ తండ్రి రియాపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News