సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే తన సుదీర్ఘకాల ప్రియుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ లో హీరోయిన్స్ పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించడం ఉండదు. కానీ సౌత్ లో మాత్రం పెళ్లి తర్వాత హీరోయిన్స్ కి సినిమాలు తగ్గుతాయి.. వారు కొన్ని కారణాల వల్ల సినిమాలు తగ్గించుకుంటారు. అలాగే వారికి మునుపటి తో పోల్చితే తక్కువ ఆఫర్లు వస్తూ ఉంటాయి. దాంతో కొందరు పెళ్లి అయిన హీరోయిన్స్ పారితోషికం తగ్గించుకుని మరీ నటించేందుకు సిద్ధం అవుతారు.
నయనతార మాత్రం పెళ్లి తర్వాత తన పారితోషికం ను మరింతగా పెంచినట్లుగా సమాచారం అందుతోంది. చాలా సంవత్సరాలుగా నయనతార పారితోషికం సౌత్ హీరోయిన్స్ లోనే టాప్ రేంజ్ లో ఉంది. అలాంటి ఈ అమ్మడు తన పారితోషికం ను ఏకంగా ఏడు నుండి ఎనిమిది కోట్లకు పెంచిందట. ఒక పెళ్లి అయిన హీరోయిన్ కి అది కూడా సౌత్ లో ఇంత పారితోషికం ఇవ్వడం చాలా కష్టం.
పెళ్లి తర్వాత నయనతార తన సినిమాల సంఖ్య తగ్గించుకోవాలి అనుకుంది. కానీ తాను డిమాండ్ చేసిన ఆ భారీ పారితోషికం తో ముందుకు వస్తే మాత్రం చేసేందుకు ఓకే అంటానంటోంది. కనుక సహజంగానే ఆ భారీ పారితోషికం తో ఆమెతో వర్క్ చేసేందుకు మెజార్టీ ఫిల్మ్ మేకర్స్ సిద్ధం అవ్వక పోవచ్చు.
కమర్షియల్ హీరో సినిమాలో ఆమె ను నటింపజేస్తే వర్కౌట్ అవ్వడం కష్టం. అందుకే ఇటీవల బాలయ్య కోసం ఆమెను సంప్రదించిన అనిల్ రావిపూడి మళ్లీ వెనక్కు తగ్గినట్లుగా టాక్ వినిపిస్తుంది.
కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలు.. అది కూడా తాను డిమాండ్ చేసిన సినిమాలను మాత్రమే ఈమె చేయాలని భావిస్తున్నట్లుగా దీన్ని బట్టి అర్థం అవుతుంది.
సినిమాల సంఖ్య తగ్గించుకోవడం ఈ అమ్మడు పారితోషికం విపరీతంగా పెంచేసిందనే టాక్ తమిళ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతానికి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు మరో వైపు నటించేందుకు మరియు నిర్మించేందుకు కూడా సిద్ధం అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.