పవన్ మాజీ వైఫ్.. పదేళ్ల క్రితం ఇదే రోజు

Update: 2016-04-08 05:15 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఇవాళ తెగ సంతోషంతో హంగామా చేసేస్తున్నారు. పవన్ కొత్త మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కావడంతో.. థియేటర్లన్నీ పవన్ మేనియాతో ఊగిపోతున్నాయి. ఉగాది పండుగ సందర్భంగా ఈ రోజునే తన మూవీ రిలీజ్ చేశాడని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇవాల్టి రోజుకి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది.

పవర్ స్టార్ కుమారుడు అకీరా బర్త్ డే ఇవాళే. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెప్పిన పవన్ మాజీ వైఫ్ రేణూ దేశాయ్.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. '8 ఏప్రిల్ 2004, ఓ చిన్నారిగా నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నాను. మొదటిసారి భుజంపై వేసుకున్నాను. ఇప్పుడు 12 ఏళ్ల కుర్రాడివి అయిపోయావ్. సోదరి ఆద్యను ప్రేమగా చూసుకునే, నా ప్రియమైన కొడుకువి. నీలాంటి కొడుక్కి అమ్మ అయినందుకు నేనెంతో ఆనందంగా ఉన్నా. ఐలవ్యూ.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్' అంటూ ట్వీట్ చేసింది రేణూ దేశాయ్.

అంతే కాదు.. కొడుకు అకీరాతో కలిసి దిగిన లేటెస్ట్ ఫోటోను కూడా పోస్ట్ చేసింది రేణూ. బుల్లి పవర్ భలే ఉన్నాడంటూ.. ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
Tags:    

Similar News