మిల్కీ బ్యూటీనే రీప్లేస్ చేసేట్టుంది!

Update: 2021-02-07 11:11 GMT
చూస్తుంటే మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నానే రీప్లేస్ చేసేట్టుంది! డెబ్యూ బ్యూటీ కృతి శెట్టిని చూస్తూ యూత్ వ‌దుల్తున్న‌ కామెంట్ ఇది. అంతగా ఆ ఇద్ద‌రికీ మ‌ధ్య పోలిక ఏం ఉంది? అంటే రెండు ద‌శాబ్ధాల క్రితం శ్రీ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన త‌మ‌న్నాలా వైబ్రేంట్ లుక్ తో మెరిపిస్తోంది క‌న్న‌డ సోయ‌గం కృతి శెట్టి. ఓమారు ఫ్లాష్ బ్యాక్ కి వెళితే హ్యాపీడేస్ మూవీలో చీర క‌ట్టు త‌మ‌న్నాను.. 100 ప‌ర్సంట్ ల‌వ్ లో త‌మ్మూ చీర‌క‌ట్టును త‌ల‌పించ‌డం లేదూ?

ఏదేమైనా కానీ ఇంకా మొద‌టి సినిమా రిలీజ్ కాక ముందే మిలియ‌న్ ట్రిలియ‌న్ గుండెల్ని ట‌చ్ చేసింది కృతి. ఆ తీరైన రూపం అందచందాలు.. కోల్గేట్ పంటి వ‌రుస .. చిక్లెట్ క‌ళ్లు గుండెల్ని గిచ్చేస్తున్నాయ్. అస‌లు కృతి అంటే ప‌డిచ‌చ్చే వీరాభిమానులున్నారు. ఇక ఉప్పెన రిలీజైతే ఈ అమ్మ‌డికి టీనేజీ స్కూల్ కాలేజ్ బోయ్స్ విప‌రీతంగా ప‌డి చ‌స్తారంటే న‌మ్మండి.

కృతి ఇప్పుడు డ్రీమ్ గ‌ర్ల్. ల‌క్ష‌లాది కుర్రాళ్ల గుండెల్లో ల‌బ్ డ‌బ్ ని ల‌వ్ ల‌వ్ గా మార్చిన హాట్ ఫేవ‌రెట్ గాళ్.  పాత నీరు పోయి కొత్త నీరు రావాలి. అలానే కృతి వ‌చ్చింది. ఇంకా తొలి సినిమా అయినా రిలీజ్ కాక‌ముందే నాలుగు సినిమాల‌కు సంత‌కాలు చేసిందంటే కృతి రేంజు ఏ లెవ‌ల్లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇటీవ‌లి కాలంలో ర‌ష్మిక త‌ర్వాత మ‌ళ్లీ క‌న్న‌డ నుంచి అంత వేవ్ తో దూసుకొచ్చింది ఈ అమ్మ‌డే. ఇంకా చెప్పాలంటే ర‌ష్మిక కంటే వెయ్యి మైళ్ల ముందుకు ఉరికింది ఉప్పెన‌లాగా!!
Tags:    

Similar News