'రామ్ గోపాల్ వర్మ..’ కొందరి దృష్టిలో పిచ్చివాడు. మరికొందరి దృష్టిలో అనితరసాధ్యమైన జీనియస్. కొందరి దృష్టిలో స్వార్థపరుడు, మరికొందరి దృష్టిలో అత్యంత నిజాయితీ పరుడు. ఆయన్ను చూసే విషయంలో జనాల్లో తేడాలున్నట్టుగానే.. ఆయన ట్వీట్లను, వ్యాఖ్యలను అర్థం చేసుకోవడంలోనూ తేడాలున్నాయి.
మొన్నటికి మొన్న సెకండ్ వేవ్ విజృంభణకు కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు నిర్లక్ష్యమే కారణమని చెప్పడానికి రాజకీయ నేతలు సైతం ముందూ వెనకా ఆలోచిస్తున్న తరుణంలో.. డైరెక్టుగా ప్రధాని మోడీని ట్యాగ్ చేస్తు మరీ ప్రశ్నించారు ఆర్జీవీ. తానొక సాధారణ హారర్ ఫిల్మ్ డైరెక్టర్ అని, మోడీ తనను మించిన హారర్ ఫిల్మ్ మేకర్ అంటూ శ్మశానాల్లో కాలిపోతున్న శవాల ఫొటోలను పోస్టు చేశారు. ఇలా వరుస పోస్టులతో కేంద్రం నిర్లక్ష్యాన్ని నిగ్గదీశారు. ఇది ఎంతో మందిని ఆశ్చర్యపరిచింది. స్వార్థపరుడినని చెప్పుకునే వర్మ నుంచి సమాజహితమైన పోస్టులు కూడా వస్తాయా? అని అనుకున్నారు.
అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తే.. వర్మ వేసే ప్రతిపోస్టుకూ ఓ లెక్క ఉంటుంది. ఒకటి హాస్యం పండించడానికైతే.. మరొకటి తనలోని మరో కోణాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇంకోటి.. తన సినిమా ప్రమోషన్ కోసం ఉంటుంది.. మరొకటి జనం అటెన్షన్ తనవైపు తిప్పుకోవడానికి వేసేది ఉంటుంది. లేటెస్ట్ గా నవ్వులు పూయించే ట్వీట్ వదిలాడు ఆర్జీవీ.
కరోనా శాస్త్రీయ నామం కొవిడ్ 19 అన్నది మాత్రమే దాదాపుగా అందరికీ తెలుసు. కానీ.. ఆ తర్వాత వచ్చిన వేరియంట్ల గురించి చదువుకున్న వాళ్లకు కూడా చాలా మందికి తెలియదు. పుట్టుకొస్తున్న ప్రతీ వేరియంట్ కు ఓ నంబర్ ఇచ్చేస్తున్నారు సైంటిస్టులు. దీనిపై కామెడీతో కూడిన సెటైర్లు వేశాడు వర్మ. ఇలాంటి పేర్లు గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉందని, చక్కగా మనుషుల పేర్లు పెట్టొచ్చుకదా.. అని ట్వీట్ చేశాడు.
‘‘శాస్త్రవేత్తలరా.. ఈ వైరస్ వేరియంట్ల పేర్లు ఎవరికీ అర్థంకాకుండా ఉన్నాయి. Bi7172, Nk4421, K9472, AV415 అంటూ.. గుర్తుపెట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. ఇలాంటి పేర్లు ఎందుకు పెడుతున్నారు? ఈ వైరస్ వేరియంట్లకు కూడా ప్యారేలాల్, చింటూ, జాన్ డేవిడ్, సుబ్బారావు వంటి పేర్లు పెట్టొచ్చు కదా?’’ అని ట్వీట్ చేశాడు.
నిజానికి ఈ వేరియంట్ల పేర్లు వందలో ఒకరిద్దరికి మాత్రమే తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో వర్మచేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. కొందరు వర్మపై సెటైర్లు వేస్తుంటే.. ఫ్యాన్స్ మాత్రం ‘వర్మ మళ్లీ వేసేశాడు’ అంటున్నారు.