నేనింతే.. నా చావు అలా ఉండాలి

Update: 2021-06-29 06:30 GMT
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన వంటి వారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. బంధాలు బాధ్యతల గురించి పట్టని వర్మ తన చావును కూడా చాలా లైట్ తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. రామ్‌ గోపాల్ వర్మ ప్రతి విషయంలో లైట్‌ గా ఉన్నట్లుగానే తన చావు విషయంలో కూడా అంతే లైట్ గా ఉన్నట్లుగా తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. తనకు భయం అంటూ తెలియదు.. చావు భయం లేదన్నాడు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో చనిపోయే వారు కదా దాని గురించి ఎందుకు ఆందోళన అంటూ వర్మ వింత థియరీ చెప్పుకొచ్చాడు.

ప్రతి ఒక్కరికి పుట్టుక ఎంత సహజంగా జరిగిందో చావు కూడా అంతే సహజం. కనుక నేను చనిపోతున్న సమయంలో అణుబాంబు పేలుడును చూడాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు చనిపోతున్న సమయంలో ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. కాని రామ్‌ గోపాల్‌ వర్మ మాత్రం తన చావు అత్యంత భయంకరంగా ఉండాలని.. ప్రతి ఒక్కరు భయపడే దాన్ని చూస్తూ తాను చనిపోవాలనుకోవడం ఆయన తీరుకు నిదర్శణం అనడంలో సందేహం లేదు.

చనిపోయే సమయంలో అనుబాంబు పేలుడును చూడాలనుకుంటున్న వర్మ ఆ తర్వాత ఈ సృష్టి.. జనాలు ఏమై పోయినా తనకు సంబంధం లేదు అన్న రీతిన ఆలోచిస్తున్నాడు. ఆయన ఎప్పుడైనా అంతే తన గురించి తాను మాత్రమే ఆలోచిస్తాడు. ఇతరులు తన గురించి ఆలోచిస్తారనే విషయాన్ని పట్టించుకోడు.. అలాగే ఇతరుల గురించి తాను కూడా పట్టించుకోడు. అందుకే నేను ఇంతే నా చావు అలాగే ఉండాలని రామ్ గోపాల్‌ వర్మ వంటి వారు మాత్రమే మాట్లాడగలరు.
Tags:    

Similar News