అవార్డుల్లో స్పీచ్ తో కొల్ల‌గొట్టిన రాకింగ్ స్టార్

Update: 2019-11-13 11:49 GMT
ప్ర‌తిష్ఠాత్మ‌క జీక్యూ 50 అవార్డ్స్ -2019 జాబితాలో క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ పేరు నిలిచిన సంగ‌తి తెలిసిందే. ముంబై గ్రాండ్ హ‌య‌త్ లో జ‌రిగిన అవార్డ్స్ వేడుక‌లో బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ క‌ర‌ణ్ జోహార్- జీక్యూ ఛీఫ్ ఎడిటర్ చి ఖురేన్ చేతుల‌మీదుగా ఈ పుర‌స్కారాన్ని య‌శ్ అందుకున్నారు.

ఇంత గ‌ప్ప అవ‌కాశం త‌న‌కు ద‌క్కినందుకు క‌న్న‌డ‌ రాకింగ్ స్టార్ య‌శ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా జీక్యూ బృందానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. నాతో పాటు మ‌రో 49 మంది విభిన్న రంగాల‌కు చెందిన‌ ప్ర‌ముఖులను క‌లిసేందుకు నాకు అవ‌కాశం ద‌క్కినందుకు చాలా సంతోషంగా ఉంది. వారిని క‌లిసి ఎంతో నేర్చుకునేందుకు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఉంది! అని ఆనందం వ్య‌క్తం చేశారు. అభిమానులు.. శ్రేయోభిలాషులు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. 40లోపు ప్ర‌తిభావంతులు చిన్న వ‌య‌సులోనే త‌మ‌దైన ట్యాలెంటుతో స‌మాజాన్ని ఎలా ప్ర‌భావితం చేశారు? అన్న క్వాలిటీ ఆధారంగా ఈ అవార్డుల్ని ఇస్తారు. జీవితంలో కీల‌క స‌మ‌యంలో ఎలాంటి స‌వాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జ‌యాప‌జ‌యాలు ఎలా ఉంటాయి? వ‌ంటి విష‌యాలు ప్రాతిప‌దిక‌గా ఉంటాయి.

కేజీఎఫ్ 1 ఘ‌న‌విజయం నేప‌థ్యంలో ఈ సినిమా సీక్వెల్ కోసం రాక్ స్టార్ య‌శ్ రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక జీక్యూ అవార్డ్ అందుకున్న‌ అనంత‌రం ఇంట‌ర్వ్యూలో య‌శ్ కి మీడియా నుంచి ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు ఎదురైతే వాటికి కూల్ గా ఆన్స‌ర్స్ ఇచ్చి ఆక‌ట్టుకున్నాడు. మీ జీవితంలో కూలెస్ట్ థింగ్ ఏది? అని అడిగితే నా పెళ్లి అని స‌మాధానం ఇచ్చాడు. మీ స్ఫూర్తి ఎవ‌రు? అని ప్ర‌శ్నిస్తే.. దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ- ఎం.ఎస్.ధోని- క‌న్న‌డ వెట‌ర‌న్ న‌టుడు శంక‌ర్ నాగ్ త‌న స్ఫూర్తి అని చెప్పాడు. 2019లో వ‌చ్చిన‌ ఫేవ‌రెట్ సినిమాల గురించి అడిగితే యూరి-క‌బీర్ సింగ్ చిత్రాలు త‌న ఫేవ‌రెట్స్ అని వెల్ల‌డించారు. య‌శ్ న‌టించిన కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 క‌న్న‌డలోనే గాక ఉత్త‌రాదినా బంప‌ర్ హిట్ కొట్టింది. ఈ నేప‌థ్యంలో అత‌డి క్రేజు విశ్వ‌వ్యాప్తం అయ్యింది. ప్ర‌భాస్ త‌ర్వాత సౌత్ నుంచి వెళ్లి నార్త్ లో చ‌క్క‌ని ఫాలోయింగ్ తెచ్చుకున్న పాన్ ఇండియా హీరోగా య‌శ్ కి గుర్తింపు ద‌క్కింది. య‌శ్ ఒక బ‌స్ డ్రైవ‌ర్ కొడుకు అయ్యి ఉండి ఎంతో సాధించాడన్న‌ది అంద‌రి పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ క్రేజుతోనే అత‌డికి ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డులు ద‌క్కుతున్నాయి.
Full View
Tags:    

Similar News