ఇంకా షూటింగ్ మొదలుకాకుండానే విపరీతమైన చర్చలో ఉన్న టాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క రాజమౌళి దీనికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తెరవెనుక చాలా వర్క్ జరిగిందని లీకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే జక్కన్న ఏ న్యూస్ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాడని టాక్. ఇకపోతే ఆలు లేదూ చూలు లేదూ సమేత తరహాలో స్టోరీ లీక్స్ పేరిట జరుగుతున్న ప్రచారం అభిమానులకు కోసం బదులు నవ్వు తెప్పిస్తోంది.
దాని ప్రకారం ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర నెగటివ్ షేడ్స్ లో అంటే విలన్ తరహాలో ఉంటే రామ్ చరణ్ రోల్ పాజిటివ్ గా ఉంటుందట. తారక్ విలన్ లా అనిపించినా హీరో లక్షణాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుందని ఇలా రకరకాలుగా ప్రచారం కావడంతో ఇది సోషల్ మీడియా వలలో కూడా చిక్కుకుంది. నిజానికి రాజమౌళి ఈ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుని ఉంటాడు. కొణిదెల నందమూరి కాంబో మొదటిసారి కుదురుతోంది కాబట్టి స్క్రిప్ట్ విషయంలో కానీ పాత్ర డిజైన్ ల గురించి కానీ ఫ్యాన్స్ ని నొప్పించకుండా ఎలా బాలన్స్ చేయాలో మాస్ మాంత్రికుడికి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
ఒక హీరోను కథానాయకుడిగా మరో హీరోని విలన్ గా చూపించడం ఒకే ఇమేజ్ ఉన్న వాళ్ళతో సాధ్యపడదు. సో వచ్చిన టాక్ అసంబంద్ధం అనే చెప్పాలి. వచ్చే నెల మూడో వారం నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్న ఈ మూవీ షూటింగ్ ఎంత లేదన్నా ఏడాదికి పైగా జరుగుతుంది. 2020 దాకా విడుదల మీద ఆశలు పెట్టుకోవడానికి లేదు. ఫుల్ జోష్ లో ఉన్న తారక్ చరణ్ ల కాంబినేషన్ ని ఎప్పుడెప్పుడు తెరమీద చూద్దామా అనే ఆత్రం ఫ్యాన్స్ కు ఉన్నప్పటికీ వేచి చూడాల్సిన టైం అయితే చాలా ఉంది.