తమిళ హీరో విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సినిమా వారిసు. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో.. భారీ తారగణంతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. నాలుగైదు సినిమాలు కలిపి చూసిన ఫీల్ ఉందని తెలుగు ప్రజలు అంటున్నారు. అందుకే ఎప్పుడు లేని విధంగా అజిత్ తెగింపు సినిమాకు ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. ఇక తన సినిమాను ఎక్కువగా తమిళంలో ప్రమోట్ చేసేందుకు వంశీపైడిపల్లి ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ అనేక ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు సైతం ఇస్తున్నాడు.
తాజాగా అక్కడి ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన వంశీ.. ''ఒక సినిమా తీయడం ఎంత కష్టమో తెలుసా? దానికి ఎంత కష్టపడాలో తెలుసా.. ఎన్నో త్యాగాలు చేయాలి. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి మా లైఫ్ పెడుతున్నాం. ఇట్స్ నాట్ ఏ జోక్ బ్రదర్..'' అంటూ వ్యాఖ్యలు చేశారు.
సరే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేసేడు అనుకుందాం.. ఎవరికోసం చేస్తున్నారు? సినిమాలు ఏమైనా ఫ్రీగా చేస్తున్నారా.. అంటూ.. నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అన్ని త్యాగాలు చేసి... జీవితాలు పాడు చేసుకునే బదులు ఏదో ఉద్యోగం చేసుకుని బతకొచ్చు కదా.. అంటూ నెటిజన్స్ వంశీకి సలహాలు ఇస్తున్నారు.
మరికొందరు ఇదే విషయం మీద తమిళ దర్శకుడు లోకేశ్ కనకరాజు చేసిన కామెంట్స్‌ను వంశీ పైడిపల్లి కామెంట్స్‌తో పోల్చీ మరీ మీమ్స్ చేస్తున్నారు. గతంలో లోకేశ్ కనకరాజు మాట్లాడుతూ... ''అందరిలాగా నేను ఈ సినిమా కోసం ఇంత కష్టపడ్డాను. అంత ఎఫర్ట్ పెట్టాను.. అని చెప్పొచ్చు. కానీ చివరికి మేము చేసే పనికి మాకు కోట్ల రూపాయలు వస్తున్నాయి. అయితే 2వేలు సంపాదించే ఒక వ్యక్తి.. నా సినిమా చూడటం కోసం ఖర్చు పెట్టే 200 రూపాయలకే నేను ఎక్కువ విలువ ఇస్తా.. అంటూ ఆయన గతంలో వ్యాఖ్యలు చేశారు.
వంశీ చెప్పినట్టు వాళ్లు నిజంగానే జీవితాలు సినిమా కోసం ఫణంగా పెట్టి ఉండవచ్చు. ఎన్నో విషయాలు త్యాగం చేసి ఉండవచ్చు. కానీ థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుడికి అవన్నీ అనవసరం కదా.. హీరో ఎవరైనా... దర్శకుడు ఎవరైనా... సినిమా అలరించే విధంగా ఉంటేనే ప్రేక్షకులు పట్టం కడతారు. ఇక మీదటనైనా జీవితాలు త్యాగం చేసామనే మాటలు కాకుండా సినిమాలో సబ్జెక్ట్ ఏముందని మాట్లాడితే బెటర్ ఏమో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.