మెగా మేనల్లుడు పూర్తిగా వదిలేశాడు

Update: 2016-08-13 13:30 GMT
ఇప్పుడు మెగా కుర్రాళ్లందరూ ఒక విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. తమ సినిమాల కథలు ఎలా ఉన్నా.. అలాగే ఆ సినిమాల్లోని కంటెంట్ ఎలా ఉన్నా కూడా.. మెగా ట్యాగ్ మాత్రం ఎక్కువగా వాడకుండా చూసుకుంటున్నారు. ఆల్రెడీ ఇదే విషయంలో అల్లు శిరీష్‌ మెగాస్టార్ మరియు పవర్ స్టార్ గురించి ఏ మాత్రం ప్రస్తావన తీసుకురాకుండా శ్రీరస్తు శుభమస్తు సినిమాను లాగించేశాడు. ఇప్పుడు మెగా మేనల్లుడి వంతొచ్చింది.

అయితే తన సినిమాల్లో చిరంజీవి పాటలను రీమిక్స్ చేయడం.. లేదంటే తన సినిమాలతో చిరు అండ్ పవన్ వేసిన కొన్ని రోల్స్ ను గుర్తుకుతెచ్చేలా గెటప్ వేయడం. ఇలా నరుక్కొస్తూ చివరకు మెగా ఇమిటేటర్ అనే ట్యాగ్ దక్కించుకున్నాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. కాని ఇప్పుడు సీన్ మార్చాడు. 'తిక్క' సినిమాలో అసలు మెగా రిఫరెన్స్ అనేదే లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ సినిమాలో ఎటువంటి క్యారెక్టర్ ఇమిటేషన్లు కాని.. డైలాగ్ పంచులు కాని.. పాటల్లో వాడకం కాని లేదు. పూర్తి 'మెగా' ఫ్రీ సినిమాగా మనం తిక్కను చూడొచ్చు.

ఇకపోతే మిశ్రమ టాక్ తో బయటకొచ్చిన టాక్ తో తిక్క సినిమా సాయిధరమ్ తేజ్ కు హ్యాట్రిక్ ను తెస్తుందో లేదో  అనే విషయం తెలియాలంటే మాత్రం.. ఈ హాలీడే వీకెండ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News