శర్వానంద్ - సాయి పల్లవి జంటగా ప్రస్తుతం ‘పడి పడి లేచె మనసు’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హిమాచల్ ప్రదేశ్ లో జరుపుతున్నారు. అక్కడ ప్రస్తుతం మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అంతటి చలిలో హీరో - హీరోయిన్ మద్య రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా అక్కడ చిత్రీకరణ జరుపుకోలేదట. మొదటి సారి ఆ ప్రదేశంలో తమ సినిమా చిత్రీకరణ జరుపుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం శర్వానంద్ అయ్యప్ప మాలలో ఉన్నాడు. అయినా కూడా సినిమా సరైన సమయంకు విడుదల చేయాలనే ఉద్దశ్యంతో ఈ పాట చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. చాలా కష్టమైన పరిస్థితుల్లో ప్రస్తుతం పాట చిత్రీకరణ జరుపుతున్నామని, హీరో, హీరోయిన్స్ మద్య సాగే ఈ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఈ చిత్రంలో డాక్టర్ గా సాయి పల్లవి కనిపించబోతుండగా, శర్వానంద్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాటతో చిత్రీకరణ దాదాపుగా పూర్తి అవుతుందని సమాచారం అందుతుంది. ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లై చిత్రంతో ఫ్లాప్ అయిన హను రాఘవపూడి స్క్రిప్ట్ విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.