ఫిదాలో హైబ్రిడ్ పిల్ల భానుమతిగా అల్లరి చేసి దోచేసిన సాయి పల్లవి గత కొంత కాలంగా హీరోలతో విభేదాల విషయమై బాగా వార్తల్లో నానుతోంది. విచిత్రంగా తమిళ హీరోలతో ఎలాంటి ఇబ్బంది లేకపోగా కేవలం తెలుగు హీరోల విషయంలోనే ఇవి రావడం గమనార్హం. ఇటీవల శర్వానంద్ తో గొడవ అయ్యిందని అందుకే పడి పడి లేచే మనసు షూటింగ్ కాస్తా వాయిదా పడిందని రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఎట్టకేలకు సాయి పల్లవి దీని గురించి స్పందించింది. శర్వానంద్ పడి పడి లేచే మనసుతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా షూటింగ్ లో కూడా ఉన్నాడని అందువల్ల బ్రేక్ వచ్చిందని తామిద్దరి మధ్య ఏదో జరిగింది కాబట్టి ఆగిపోయింది అనే వార్తలను కొట్టి పారేసింది. సో శర్వానంద్ తో ఇష్యూ గురించి సాయి పల్లవి చెప్పినదాన్ని బట్టి అది పుకారు అని అర్థం చేసుకోవచ్చు.
కానీ గతంలో నాని-నాగ శౌర్యల తో సినిమాలు చేసినప్పుడు కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. శౌర్య ఏకంగా ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో సాయి పల్లవితో తనకు ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే అంటూ చెప్పడం చిన్న దుమారమే రేపింది. కణం ఫంక్షన్ లో సాయి పల్లవి దీనికి క్లారిటీ ఇచ్చి అలాంటిది ఏమి లేదని సర్దిచెప్పింది. నాని కూడా సాయిపల్లవి పేరు బయటికి వచ్చాక వాటిని కొట్టిపారేస్తూ విషయాన్నీ తేలిక చేసాడు. సాయి పల్లవి తెలుగుతో పాటు తమిళ్ లో సూర్య సరసన నంద గోపాల కృష్ణన్ తో పాటు ధనుష్ తో మారి 2 లో నటిస్తోంది. అక్కడైతే వివాదాలు వచ్చిన దాఖలాలు లేవు. ఇవి కాకుండా నీది నాది ఒకే కథ దర్శకుడు వేణు ఊడుగుల 90ల నేపథ్యంలో చెప్పిన ఒక పొలిటికల్ థ్రిల్లర్ నచ్చిందని స్క్రిప్ట్ ఒక రూపంలోకి వచ్చాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. దీంట్లో కూడా శర్వానంద్ నే హీరోగా దర్శకుడు ప్రయత్నిస్తున్నట్టు టాక్. సినిమాల సంగతి ఎలా ఉన్నా ఇలాంటివి హై లైట్ కావడం ఏ హీరోయిన్ కైనా ఇబ్బంది కలిగించే విషయమే.