బాలీవుడ్ నటీనటుల మధ్య ఎన్నో ప్రేమకథలు నడిచాయి. కొన్ని సఫలమైతే.. మరికొన్ని విఫలమయ్యాయి. అయితే.. బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సల్మాన్ వ్యవహారం కాస్త భిన్నం. ఆయన ప్రేమకథలు ఒకటి తర్వాత మరొకటిగా సా..గుతూనే ఉన్నాయి. ఫిఫ్టీకి దగ్గర్లోకి వచ్చినా ఆయన ఇప్పటికి పెళ్లి చేసుకోని పరిస్థితి. అదే సమయంలో ప్రేమించటం మానని పరిస్థితి.
పలువురు బాలీవుడ్ భామలతో ఎఫైర్లు నడిపిన సల్మాన్ లిస్ట్ కాస్త పెద్దదే. అయితే.. కొందరి విషయంలో సల్మాన్ నడిపిన ఎఫైర్ సీరియస్ గా ముందుకు వెళ్లాయి కూడా. అయితే.. పెళ్లి వరకూ ఏ ఎఫైర్ వెళ్లలేదనే చెప్పాలి. తాజాగా సల్మాన్ కు సంబంధించిన ఒక పాత వీడియో ఇంటర్వ్యూ ఒకటి వైరల్ గా మారింది. అందులో తాను నటి సంగీతా బిజిలానీని ప్రేమిస్తున్నట్లుగా చెప్పటమే కాదు.. తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని చెప్పటం ఉంది.
1993 నాటి వీడియో తాజాగా బయటకు వచ్చింది. సల్మాన్ ను లవ్ గురించి ప్రస్తావించినప్పుడు.. ఆవును..నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ సమయం వస్తే తప్పకుండా చేసుకుంటా. అది సంగీత కావొచ్చే.. ఇంకెవరైనా కావొచ్చు అని చెప్పిన సల్మాన్.. మరిన్ని ప్రశ్నలు వేసేలోపు.. వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం చెప్పనంటూ మండిపడిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/