రివ్యూల‌తో నాకు ప‌ని లేదుః స‌ల్మాన్

Update: 2017-06-16 10:01 GMT
ఒక సినిమా రివ్యూ  బాగుందా? లేదా? టాక్  ఎలా ఉంది? మ‌న టిక్కెట్ డ‌బ్బుల‌కు న్యాయం జ‌రుగుతుందా? లేదా? ఇటువంటి లెక్క‌లు వేసుకున్నాకే స‌గ‌టు ప్రేక్ష‌కుడు థియేట‌ర్ల‌కు వెళ్లి  సినిమా చూస్తాడు. సినీ విశ్లేష‌కులు ఇచ్చే రివ్యూని బ‌ట్టే సినిమా హిట్టా? ఫ‌ట్టా? అని తేలిపోతుంది. తమ సినిమాల‌కు వ‌చ్చే రివ్యూలు బాగోలేక‌పోతే రివ్యూయ‌ర్ల‌ను సినీ తార‌లు తిట్ట‌డం స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది.

సినిమాలో విష‌యాన్ని బ‌ట్టే రివ్యూలు వ‌స్తాయి. మంచి సినిమాల‌కు రివ్యూలు అద‌న‌పు  తోడ్పాటు అందిస్తాయి. అదే సినిమా బాగాలేనపుడు మంచి రివ్యూలు రావు. ఈ విష‌యాన్ని అర్థం చేసుకోలేని కొంద‌రు తార‌లు  రివ్యూలు రాసే వాళ్లపై విరుచుకుపడుతున్నారు.

బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా  ఆ తార‌ల జాబితాలో చేరాడు. సినిమా విడుదలైన రోజే సమీక్షలు రాయడం వల్ల సినిమాకు చాలా నష్టం జరుగుతోందని సల్మాన్ అభిప్రాయ‌ప‌డ్డాడు. త‌మ‌ కష్టాన్ని  రివ్యూయ‌ర్లు దోచుకుంటున్నార‌ని సల్మాన్ అన్నాడు.

రివ్యూల వల్ల తన సినిమాల మీద అసలే ప్రభావం ఉండదని అన్నాడు తన సినిమాలకు కొన్నిసార్లు జీరో రేటింగ్స్ వచ్చి నా ప‌ర్లేద‌న్నాడు. మైనస్ 100 రేటింగ్స్ ఇచ్చినా ఏం కాదంటూ సవాలు విసిరాడు.

సల్మాన్ తీసిన  చెత్త సినిమాలకు ఆ స్థాయి రేటింగులే వచ్చాయి. మంచి సినిమాలైన భ‌జరంగి భాయిజాన్ - సుల్తాన్ ల‌కు  చాలా మంచి రేటింగ్స్ వచ్చాయి. ఆ సినిమాల క‌లెక్ష‌న్ల‌కు రేటింగ్స్ దోహ‌ద‌ప‌డ్డాయి. రివ్యూయ‌ర్ల‌ను విమ‌ర్శించే ముందు ఈ విష‌యాల‌ను స‌ల్లూ భాయ్ గుర్తు పెట్టుకోక త‌ప్ప‌దు మ‌రి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News