స్టార్ క‌మెడియ‌న్ దోబూచులాట‌!

Update: 2018-08-21 04:03 GMT
రీషూట్లు చేయ‌డం ఇటీవ‌లి కాలంలో త‌ప్ప‌నిస‌రి చేశార‌నే చెప్పాలి. సినిమా ఆద్యంతం పూర్త‌య్యాక‌ - అందులో డ్రాబ్యాక్ సీన్సే ఏం ఉన్నాయో చూసుకుని వాటిని తిరిగి రీషూట్ చేసే ప‌ని పెట్టుకుంటున్నారు. పెర్ఫెక్ట్ కామెడీ - ఎమోష‌న్ పండిందో లేదో ప‌రిశీల‌న‌గా చూసుకుని ఆ త‌ర్వాత‌నే రిలీజ్ తేదీని ఫైన‌ల్ చేసుకుంటున్నారు. ఈ విష‌యంలో అక్కినేని కాంపౌండ్ అంద‌రికంటే అడ్వాన్స్‌ డ్‌ గా ఉంటుంది. కింగ్ నాగార్జున ఫైన‌ల్ ప్రొడ‌క్ట్ సంతృప్తిక‌రంగా వ‌చ్చే వ‌ర‌కూ ఓకే చెప్ప‌రు. అలా చేసి గ‌తంలో చాలా సినిమాల్ని బంప‌ర్‌ హిట్లు చేశారు.

ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ నాగ‌చైత‌న్య `శైల‌జారెడ్డి అల్లుడు` చిత్రానికి రీషూట్లు చేయాల్సిన స‌న్నివేశం ఉంద‌ని స‌మాచారం. ఇటీవ‌లే ఈ సినిమా ర‌ఫ్ క‌ట్ చూసిన స‌మంత ఇందులో వెన్నెల కిషోర్ సీన్లు అనుకున్నంత బాగా రాలేద‌ని ద‌ర్శ‌కుడికి చెప్పార‌ట‌. ఆ సీన్ల‌లో కామెడీని మ‌రింత‌గా వ‌ర్క‌వుటయ్యేలా చేస్తే బావుంటుంద‌ని సూచించారట‌. అయితే రిలీజ్ ముంగిట ఈ సూచ‌న ఎంత‌వ‌ర‌కూ క‌రెక్ట్ అన్న‌ది తెలియాల్సి ఉందింకా. ఇప్ప‌టికే ఈనెల‌ 31న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సాంకేతిక కార‌ణాల వ‌ల్ల‌ వాయిదా ప‌డింద‌ని తెలుస్తోంది. కేర‌ళ వ‌ర‌ద‌ల కార‌ణంగా ఈ సినిమాకి కూడా కొన్ని చిక్కులు త‌ప్ప‌లేదు. ఆ క్ర‌మంలోనే సెప్టెంబ‌ర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం వెన్నెల కిషోర్ సీన్లు రీషూట్ చేయాలంటే అత‌డు అందుబాటులో లేడ‌ని తెలుస్తోంది. వెన్నెల అమెరికా వెళ్లాడు. అక్క‌డి నుంచి తిరిగి రావాల్సి ఉంటుందిట‌. `గీత గోవిందం` విజ‌యంలో వెన్నెల‌ కిషోర్ కామెడీకి ప్ర‌ధానంగా మార్కులు ప‌డ్డాయి కాబ‌ట్టి.. ఎట్టిప‌రిస్థితిలో మారుతి అండ్ టీమ్ వెన్నెల‌ను ర‌ప్పించే ప‌నిలోనే ఉన్నార‌ని తెలుస్తోంది. రీషూట్లు చేయ‌డం హిట్టు కొట్ట‌డం అక్కినేని కాంపౌండ్‌ కి అల‌వాటే కాబ‌ట్టి, ఈ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News