టెంపర్ సినిమాతో హిట్ కొట్టి వెళ్లిపోయింది కాజల్. తమిళ్, హిందీ కే అంకితమైపోయింది. ఇక తెలుగులో కనిపించనని హిందీ పరిశ్రమకి వెళ్లిపోయింది ఇలియానా. ఇప్పుడు అదే జాబితాలో మరికొన్ని పేర్లు చేరిపోతున్నాయి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్ని సరసన 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో నటించింది సమంత. ఈ సినిమా విజయం సాధించాక తమిళంలో పూర్తి బిజీ అయిపోయింది. అక్కడ విజయ్, సూర్య, ధనుష్, విశాల్ వంటి స్టార్ హీరోలతో కమిట్ మెంట్లు పెట్టుకుంది. ఇక ఈ అమ్మడు నటించే తెలుగు సినిమాలేవీ ఇప్పట్లో రానే రావు. వచ్చే ఏడాదిలోనే కనిపించే ఛాన్సుంది. అంటే సమంత ఇక తమిళ పరిశ్రమకే అంకితం. అదే బాటలో ఇప్పుడు శ్రుతిహాసన్ కూడా తెలుగు పరిశ్రమని విడిచిపెట్టి తమిళ్, హిందీకే పరిమితం అయిపోయే పరిస్థితి.
ఈ అమ్మడు శ్రీమంతుడుతో హిట్ అందుకుని ఇక ఇక్కణ్ణుంచి పలాయనం చిత్తగించేట్టే కనిపిస్తోంది. తమిళ్ లో ఇప్పటికే విక్రమ్, విజయ్, అజిత్ వంటి స్టార్ల సరసన నాయికగా ఎంపికైంది. అలాగే మరో రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. అంటే ఇక ఈ సంవత్సరం శ్రుతిని ఓ తెలుగు సినిమాలో చూడడం కష్టం. వచ్చే ఏడాది వరకూ ఈ భామ నేరుగా తెలుగులో నటించే వరకూ వేచి చూడాల్సిందే.