హాట్ అందాలతో సమంత కనువిందు భోజనం..!

Update: 2021-12-18 09:37 GMT
అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు తన కెరీర్ లోనే తొలిసారి ఆడిపాడిన ఐటమ్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 'పుష్ప: ది రైజ్' కోసం సామ్ ఓ ప్రత్యేక గీతం చేస్తోందని తెలిసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ పాట అనౌన్స్ మెంట్ పోస్టర్ వచ్చినప్పుడు షాక్ అయ్యారు. ఎందుకంటే సమంత అందులో అంత హాట్ గా కనిపించింది.

'ఊ అంటావా..' లిరికల్ వీడియో చూసిన తర్వాత సామ్ ఐటమ్ సాంగ్ కోసం సినీ అభిమానుల్లో ఆతృత ఎక్కువైంది. పొట్టి పొట్టి దుస్తుల్లో సమంత మరింత సెక్సీగా కనువిందు చేసింది. అందుకే ఈ పాట విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేవిశ్రీప్రసాద్ సారథ్యంలో మగవాళ్ళ బుద్ధి వంకర అంటూ వచ్చిన ఈ స్పెషల్ సాంగ్ మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

దేవిశ్రీప్రసాద్ గతంలో అనేక సూపర్ హిట్ ఐటమ్స్ సాంగ్స్ అందించారు కనుక.. 'ఊ అంటావా' పాటలో స్టార్ హీరోయిన్ సమంత నటించడమే ప్రేక్షకులకు ప్రత్యేకతగా అనిపించింది. అది కూడా విడాకుల ప్రకటన తర్వాత చేసిన పాట కావడంతో అందరు దృష్టి సారించారు. ఈ క్రమంలో వచ్చిన ప్రోమోలో సామ్ హాట్ గా కనిపించడంతో.. ఫుల్ సాంగ్ లో రెచ్చిపోయి ఉంటుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లే సినిమాలో ఈ పాట చూసిన జనాలు.. సమంత పెరఫార్మన్స్ కు ముక్కున వేలేసుకుంటున్నారు.

సమంత ఫేస్ లో గ్లో తగ్గినా.. ఐటమ్ సాంగ్ లో హాట్ నెస్ తగ్గకుండా చూసుకుంది. తన ఎక్స్ పోజింగ్ తో శీతాకాలంలో కుర్రకారుకు వేడి పుట్టించింది. లిరిక్స్ తగ్గ ఎక్స్ ప్రెషన్స్ - క్లీవేజ్ షోతో కెరీర్ లోనే మునుపెన్నడూ లేని విధంగా అందాలు ఆరబోసింది. ఐటమ్ ససాంగ్ కాబట్టి సమంత హాట్ గా కనిపిస్తుందని అందరూ అనుకున్నారు కానీ.. మరీ ఈ రేంజ్ లో ఉంటుందని ఎవరూ ఎక్సపెక్ట్ చేయలేదు. అందుకే కొరియోగ్రఫీ ఆశించిన స్థాయిలో లేకపోయినా.. సామ్ షో చూసి సినీ ప్రియులు ఎంజాయ్ చేస్తున్నారు.

దక్షిణాది నుంచి గతంలో కాజల్ అగర్వాల్ - తమన్నా భాటియా - శ్రుతి హాసన్ - పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేసి అలరించారు. కాకపోతే సమంత స్థాయిలో వీళ్ళెవరూ క్లీవేజ్ షో చేయలేదు. రెగ్యులర్ గా స్పెషల్ సాంగ్స్ లో నర్తించే ఐటమ్ భామలు అందాలు ఆరబోసినా జనాలకు అది పెద్ద విషయంలా అనిపించదు. కానీ సామ్ వంటి స్టార్ హీరోయిన్ హాట్ హాట్ అందాలతో విందు భోజనం వడ్డించడం షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

అయితే సమంత ఐటెమ్ సాంగ్ లో రెచ్చిపోవడం పై ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఈ రేంజిలో నటించాల్సిన అవసరం లేదని పలువురు సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి 'పుష్ప' లో చేసిన ప్రత్యేక గీతం సామ్ కెరీర్ కు ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూడాలి.

ఇదిలా ఉండగా భర్త నాగచైతన్య తో విడిపోతున్నట్లు ప్రకటించిన సమంత.. ఇప్పుడు కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే రెండు ద్విభాషా చిత్రాలను ప్రకటించిన సామ్.. 'యశోద' అనే పాన్ ఇండియా మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లింది. అలానే ఓ హాలీవుడ్ మూవీ అనౌన్స్ చేసింది. ఇదే క్రమంలో ప్రస్తుతం ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతోందని సమాచారం.
Tags:    

Similar News