నిజా నిజాల సంగతి కాసేపు పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కి సంబందించిన వార్త మాత్రం ఫుల్ హల్ చల్ చేస్తుంది. వీరిద్ధరికి సంబందించిన ఏ చిన్న విషయమైనా సరే... ఇప్పుడు వెబ్ మీడియాలో బ్యానర్ ఐటం కాగా.. సోషల్ నెట్ వర్క్స్ లో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ జంట ఎవరో అర్ధమయ్యే ఉంటుంది... అదే సమంత - నాగచైతన్య ల జంట! ప్రస్తుతం వీరిద్ధరికి సంబందించిన ఏ చిన్న విషయమైనా సరే.. వెబ్ మీడియాలోనూ - సోషల్ నెట్ వర్క్స్ లోనూ చర్చోపచర్లకు దారితీస్తుంది. ఈ విషయంపై నేరుగా ఎవ్వరూ స్పందించకపోయినా.. "విశ్వసనీయ వర్గాల సమాచారం" మేరకు అన్నట్లు చెలరేగిపోతున్నాయి.
ఇదే క్రమంలో సామ్ - చైతులకు సంబందించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బెంగుళూరులోని బహర్ కేఫ్ ప్రారంభోత్సవానికి అతిధిగా హాజరైంది సమంత. తన టేస్ట్ డిఫరెంట్ అంటూ ఇక్కడ ఫుల్ సందడి చేస్తూ.. బిర్యానీతో వీకెండ్ ని ఎంజాయ్ చేసింది. ఇదే సమయంలో కావాలనే రివీల్ చేసిందా లేక మామూలుగానే కెమేరా కంటికి కనిపించిపోయిందా అనే విషయం కాసేపు పక్కనపెడితే.. ఈ కేఫ్ ఓపెనింగ్ కార్యక్రమంలో కొన్ని కొత్త విషయాలు మాత్రం రివీల్ అయ్యాయి. నార్మల్ గా టాటూలకు సమంత అంతగా ఆసక్తి చూపదని అంటుంటారు కానీ, కేఫ్ ప్రారంభంలో ఆమె చేతిపై ఒక టాటూ కనిపించింది. సరే.. ఈ రోజుల్లో టాటూలు వేయించుకొవడం పెద్ద విషయమేమీ కాదు కదా అని లైట్ తీసుకుందామంటే.. అచ్చూ ఇలాంటి టాటూయే చైతూ చేతిపై కూడా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
ఇలా సమంత కుడిచేతిపై ఉన్న సేం టాటూ.. చైతూ కి కూడా రైట్ హ్యాండ్ పైనే వుండడం గమనార్హం. దీంతో ఆ పిక్ ని ఈ పిక్ ని కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ లు - లైక్ లు - షేర్ లు చేసేస్తున్నారు జనాలు. ఏమాటకామాట చెప్పుకోవాలంటే... చైతూ-సామ్ ఇద్దరి టేస్ట్ లు ఒకేలా వున్నాయని ఇప్పటికే సెటైర్లు పడిపోతున్నాయి. మొత్తానికి బిర్యానీ తింటున్నట్లు తింటూనే తన పర్సనల్ టాటూ గురించి చెప్పకుండానే చెప్పిందని కూడా సమంతపై కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. ఇలాంటి గాసిప్పులు - కామెంట్లు ఇంకెన్నొ రోజులు వినాల్సి వస్తుందో చూడాలి మరి!