మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. అంతకు ముందు నుండే చిరంజీవితో విజయశాంతికి ఏవో తగాదాలు అంటూ ప్రచారం జరిగింది. చిరంజీవి రాజకీయాల్లో ఉన్న సమయంలో విజయశాంతి చాలా విమర్శలు కూడా చేయడం జరిగింది. దాదాపు పాతిక సంవత్సరాలుగా చిరంజీవి మరియు విజయశాంతి ఎడమొహం పెడమొహం అన్నట్లుగానే ఉన్నారు. మళ్లీ ఇన్నాళ్లకు సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా వారిద్దరి స్నేహం మళ్లీ చిగురించిందని చెప్పుకోవచ్చు.
ఇన్నాళ్ల తర్వాత చిరంజీవి గారిని చూడగానే విజయశాంతి కళ్లలో ఆనందం కనిపించడంతో పాటు.. విజయశాంతిని ఇన్నాళ్లకు చూసిన తర్వాత చిరంజీవి కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. స్టేజ్ కింద ఇద్దరు కలిసి పక్క పక్కన కూర్చోక పోవడంతో ఇద్దరు ఇంకా ఎడమొహం పెడమొహం అన్నట్లుగానే ఉన్నారేమో అనే అనుమానాలు అయితే కొందరు వ్యక్తం చేశారు. కాని స్టేజ్ పై చిరంజీవి మాట్లాడుతూ చివర్లో విజయశాంతి గురించి మాట్లాడిన మాటలు ఈ ప్రీ రిలీజ్ వేడుకకే హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. అయిదు నిమిషాల పాటు చిరంజీవి మరియు విజయశాంతిల మద్య జరిగిన సంభాషణలు అందరిని నవ్వించడంతో పాటు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేశాయి.
చిరంజీవి మాట్లాడుతూ మనిద్దరం కలిసి దాదాపు 20 సినిమాలు చేశాం.. ఇద్దరం అంత స్నేహంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాదిరిగా ఉన్నాం. అంతగా ఉన్న నాపై రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు ఎలా చేయాలనిపించింది అంటూ సరదాగా ప్రశ్నించిన సమయంలో విజయశాంతి కాస్త ఇబ్బంది పడ్డట్లుగా అనిపించినా ఆ వెంటనే తేరుకుని రాజకీయాల్లో ఉన్నప్పుడు తప్పలేదు అని... కాని నా మనసులో నీవు నా స్నేహితుడివే అంది. అదే సమయంలో చిరంజీవి మళ్లీ మాట్లాడుతూ నీవు నన్ను ఎన్ని సార్లు విమర్శలు చేసినా కూడా నేను మాత్రం కనీసం ఒక్కసారి కూడా విమర్శించలేదు అన్నాడు. అప్పుడు కూడా విజయశాంతి కాస్త ఇబ్బంది పడ్డట్లుగా అనిపించి నవ్వుకుంటూ ఉంది.
ఇద్దరు హగ్ చేసుకోవడం.. ఇద్దరు చాలా క్లోజ్ గా సరదాగా మాట్లాడుకోవడం చూసి ఎల్బీ స్టేడియంలోని అభిమానులు మరియు బుల్లి తెరపై చూసిన ప్రేక్షకులు అంతా కూడా ఒకింత భావోద్వేగానికి లోనై ఉంటారు. 20 సినిమాలు చేసిన వీరిద్దరు మళ్లీ కూడా నటించాలని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. మొత్తానికి సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుక క్లైమాక్స్ అదిరింది అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.