9 కోట్ల రూపాయల పెట్టుబడికి 30 కోట్ల రూపాయల షేర్. అంటే పెట్టుబడికి రెట్టింపునకు పైగా లాభం అన్నమాట. మరి అంతటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి ఏ రేంజ్ లో పేరు రావాలి? అది కూడా చిరంజీవి.. బాలకృష్ణల సినిమాలతో పోటీగా విడుదల చేసి సక్సెస్ సాధించిన సతీష్ వేగేశ్న పేరు.. ఇండస్ట్రీ అంతా ఈ పాటికే మార్మోగిపోవాలి. కానీ వాస్తవం అలా లేదు. అసలు ఈ దర్శకుడిని ఎవరూ పట్టించుకోవడం లేదు కూడా.
ఇండస్ట్రీ జనాలతో పాటు ఆడియన్స్ కూడా శతమానం భవతిని దిల్ రాజు సినిమాగానే చూస్తున్నారు. ప్రమోషన్స్ కూడా అలాగే జరుగుతున్నాయి. రీసెంట్ గా సక్సెస్ మీట్ లో శర్వానంద్ చెప్పిన మాటలు ఇందుకు ఎగ్జాంపుల్. సతీష్ వేగేశ్న కథ చెప్పినపుడు.. 'వెంటనే దిల్ రాజుకి ఫోన్ చేసి.. ఏం కథ రాయించావన్నా' అన్నాను అని చెప్పాడు శర్వా. అంటే శర్వానంద్ దృష్టిలో ఇది దిల్ రాజు రాయించిన కథే. అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు. గతంలో దొంగల బండి.. రామదండు లాంటి ఫ్లాప్స్ తర్వాత ఇంతటి భారీ విజయం అందుకున్న దర్శకుడికి ఆశించిన గుర్తింపు దక్కడం లేదనే చెప్పాలి.
ఇందుకు కారణం అది ఫ్యామిలీ స్టోరీ కావడమే అని చెప్పచ్చు. బొమ్మరిల్లు.. ఆర్య లాంటి సినిమాల్లో ఉన్న నావెల్టీ కారణంగా ఆయా దర్శకులు ఇండివిడ్యువల్ గా గుర్తింపు పొందగలిగారు. కానీ కామన్ పాయింట్ ను పట్టుకుని.. ఫ్యామిలీ డ్రామా నడిపించడంతో.. అది హిట్ అయినా.. దర్శకుడు సతీష్ వేగేశ్నకు ఉపయోగం లేకుండా పోయింది.