అఖిల్ హీరోయిన్.. అబ్బే చేయట్లేదు

Update: 2016-06-27 07:49 GMT
అక్కినేని అఖిల్ తో కలిసి సినీ అరంగేట్రం చేసిన హీరోయిన్ సాయేషా సైగల్. తొలి మూవీపై చాలానే ఆశలు పెట్టుకున్న ఈ భామకు.. అఖిల్ అంతగా కలిసి రాలేదు. దీంతో టాలీవుడ్ నుంచి పెద్దగా ఆఫర్స్ రాలేదు. అయితే.. అసలీ భామ అరంగేట్రం అంటే ఇక్కడ చేసింది కానీ.. మెయిన్ ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది.

అఖిల్ తర్వాత వెంటనే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ చిత్రంలో అవకాశం రావడంతో.. ముంబై జంప్ అయిపోయింది. అజయ్ దేవగన్ హీరోగా తనే దర్శకత్వం వహించి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'శివాయ్' లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఇది కాకుండా మరే చిత్రం సెట్స్ పై లేదు. ఇప్పుడీ చిన్నదానికి టాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ వెళ్లింది. ఓ కుర్రాడి కొత్త సినిమా కోసం ఆఫర్ ఇస్తే.. డేట్స్ ఖాళీ లేవని చెప్పేసిందని తెలుస్తోంది.

ఈ యంగ్ హీరో చిత్రంలో హీరోయిన్ పాత్రను సాయేషాకి ఆఫర్ చేస్తే.. ఆమె నుంచి తిరస్కారం రావడం ఆశ్చర్యం వేసింది. ప్రస్తుతం రూపొందుతున్న శివాయ్ చిత్రం రిలీజ్ వరకూ కొత్త సినిమాల విషయంలో కంగారు పడకూడదని అనుకుంటోందిట అఖిల్ భామ. అసలు ఈ సినిమాను సైన్ చేసిందా లేదా అని సయేషా మమ్మీ షాహీన్ ను అడిగితే.. ''ఆఫర్ వచ్చిన మాట నిజమే.. కాని డేట్స్ ఎడ్జస్ట్ చేయలేకపోతున్నాం. సో సైన్ చేయలేదు'' అంటూ చెప్పినట్లు.. ఒక మీడియా హౌస్‌ వెల్లడించింది.
Tags:    

Similar News