‘బాహుబలి-2’లో అంతకుమించి అంటున్నాడు

Update: 2017-04-10 10:53 GMT
బాహుబలి’ అనగానే ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూడని విన్యాసాలే గుర్తుకొస్తాయి. ఇందులో ప్రేక్షకులకు మరో ప్రపంచం కనిపించింది. అందులోని అద్భుతాల్ని తనివితీరా చూసి ఆస్వాదించారు జనాలు. ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులోని భారీతనం.. అమోఘమైన యుద్ధ సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. ‘బాహుబలి: ది కంక్లూజన్’ విషయంలోనూ ఈ ఆకర్షణల మీదే ప్రేక్షకుల దృష్టి నిలిచి ఉంది. ఐతే కెమెరామన్ సెంథిల్ కుమార్ మాత్రం కేవలం వీటి కోసమే సినిమా చూడొద్దంటున్నాడు. ‘ది కంక్లూజన్’లో అంతకుమించిన ఆకర్షణలు ఉన్నాయంటున్నాడు.

‘‘బాహుబలి-2లో తొలి భాగం కంటే భారీతనం ఉంటుంది. అద్భుతమైన యుద్ధ సన్నివేశాలు.. విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ అంతకుమించిన ఆకర్షణ ఇందులో ఉంది. అదే కథ.. పాత్రలు. తొలి భాగంలో పాత్రల పరిచయమే జరిగింది. ఇందులో ప్రధానమైన కథ ఉంటుంది. అద్భుతమైన పాత్రలుంటాయి. బాహుబలి.. భల్లాలదేవ.. దేవసేన.. శివగామి.. కట్టప్ప.. బిజ్జాల దేవ.. ఇలా ప్రతి పాత్రా ప్రత్యేకంగా ఉంటుంది. ఎమోషన్లు అద్భుతంగా పండాయి. పాత్రధారులందరూ చాలా బాగా నటించారు. మిగతా అంశాల కంటే కూడా వీరి పెర్ఫామెన్స్ ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్.. కెమెరా పనితనం.. గ్రాఫిక్స్ ఇలాంటివన్నీ కథకు ఆకర్షణ కావాలి. అవి కథను డామినేట్ చేయకూడదు. ‘బాహుబలి-2’కు మేం ఆ విషయంలో జాగ్రత్తపడ్డాం’’ అని సెంథిల్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News