కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ స్కిల్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 14 ఏళ్ల క్రితం ఐతే అనే చిత్రంతో ప్రారంభించి.. ఇఫ్పటివరకూ అనేక చిత్రాలకు తన కెమేరా పనితనం చూపించారు. రీసెంట్ రిలీజ్ అయిన బాహుబలి ది కంక్లూజన్.. ఆయన స్థాయిని ఎన్నో రెట్లు పెంచేసింది. మరి ఇంత పెద్ద సక్సెస్ తర్వాత సహజంగా చేతినిండా అవకాశాలు ఉండాలి. కానీ ఈయన చేతిలో ఒక్క మూవీ కూడా లేదు. ఇందుకు అవకాశాలు రాక కాదు.. తానే బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అయి.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు.
ముగ్గురు పిల్లలలో పెద్దవాడైన సెంథిల్.. అందరిలోకి పెద్దవాడు. తన ఇష్టం సినిమాటోగ్రాఫీ అని అర్ధం చేసుకోగానే.. ఆ దిశగానే అడుగులు వేశారు. రాజమౌళి అందించే చిత్రరాజాల వెనక ఉన్న కీలకమైన వ్యక్తి సెంథిల్ కుమార్. మగధీర లాంటి భారీ బడ్జెట్ మూవీకి వర్క్ చేసినా.. ఆ తర్వాత ఈగ లాంటి టెక్నికల్ వండర్ ను తక్కువ బడ్జెట్ తో చేయాల్సి వచ్చినా.. అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకుంటారాయన. గత కొన్నేళ్లుగా ఎంతో బిజీగా గడిపేయడంతో మొనాటనీ అనిపిస్తోందని.. అందుకే కొంత కాలం బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యానని చెప్పారు సెంథిల్.
ఫ్యామిలీ.. ఫ్రెండ్స్ తో కొంతకాలం గడిపిన తర్వాత..తిరిగి మళ్లీ పనిలో పడతానని చెబుతున్నాడు సెంథిల్. తను వర్క్ చేసిన ప్రతీ మూవీ నుంచి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉన్నానని చెబుతున్నాడు. తను ఏ వస్తువును అయినా.. ముందుగా చెక్ చేసుకుని తన వర్క్ ను మరింత సమర్ధంగా చూపేందుకు సహకరించేందుకు ఉపయోగపడుతుందని నిర్ణయించుకున్నాకే వాటిని షాపింగ్ చేస్తానని అంటున్నాడు.