డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గానే ఛాట్ షో హోస్ట్ గా కూడా కరణ్ జోహార్ చాలా పాపులర్. సెల్రబిటీల్ని తన షోకి పిల్చి నవ్వుతూనే కాంట్రవర్శీలు క్రియేట్ చేయడం కరణ్ కి మా చెడ్డ సరదా. కానీ ఇండస్ట్రీలో అందరికి కావాల్సినవాడే. అందుకే ఏదో ఒక రచ్చ అయిద్దని తెలిసినా కరణ్ పిలిస్తే ఎవరూ కాదనరు. అలాగని ప్రతీసారి గొడవలే కాదు అప్పుడప్పుడు సరదా కూడా ఉంటుంది. హీరో షాహిద్ కపూర్ అండ్ మీరా రాజ్ పుత్ ఎపిసోడే దానికి ఎగ్జాంపుల్.
గతంలో గాళ్ ఫ్రెండ్స్ గా వార్తల్లో ఉన్న హీరోయిన్స్ తో కాఫీ విత్ కరణ్ లో పార్టిసిపేట్ చేసిన షాహిద్ ఈ సారి భార్య మీరా రాజ్ పుత్ తో కలిసి పాల్గొన్నాడు. జిమ్.. రెస్టారెంట్స్.. ఎయిర్ పోర్ట్స్ దగ్గర షాహిద్ తో కలిసి ఫోటోల్లో కనిపించడం.. వైఫ్ గా వార్తల్లో ఉండటమే తప్ప మీరా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఫస్ట్ టైమ్ ఓ నేషనల్ టెలివిజన్ షోలో మీరా పాల్గొనడంతో అందరికీ ఆసక్తి. దీనికి తగ్గట్టే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కట్ చేశారు.
ఐ లవ్ యూ బేబీ అని మీరా భర్తకి ప్రపోజ్ చేయడం... ఇద్దరు క్లోజ్ గా కూర్చోని కాఫీ తాగడం.. నీ పెళ్లికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ని పిల్చావా అని కరణ్ అడిగితే నాకు గుర్తు లేదు.. నేను పిల్చినా వాళ్లు రారుగా అని షాహిద్ సమాధానలివ్వడంతో పాటు ఇద్దరు ఒకరి సీక్రెట్స్ మరొకరు చెప్పుకోవడం.. ఇలా మొత్తం ఫన్నీగా సందడి సందడి చేశారు. తిన్న తర్వాత షాహిద్ బర్ఫ్ (తేపు) అస్సలు నచ్చదని చెప్పింది మీరా. ఇదే ఎపిసోడ్లో పెళ్లికి ముందు నాకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో దానికి ఒక్క నంబర్ కూడా తగ్గకుండా మీరాకి అంతేమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని షాహిద్ అనడం కొసమెరుపు.
అయితే ఈ పూర్తి ఎపిసోడ్ చూస్తే మాత్రం.. ఇద్దరూ పెళ్లికి మునుపు సంగతులు చాలానే చెప్పేశారని మనం అనుకోవాల్సిందే. మరి స్టార్ కపుల్ ఇంకేం రివీల్ చేశారో చూడాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/