ఆ స్టార్‌ కపుల్‌ తరుచు గొడవ పడతారట

Update: 2019-06-17 09:06 GMT
తెలుగులో సెన్షేషనల్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న 'అర్జున్‌ రెడ్డి' సినిమాను హిందీలో షాహిద్‌ కపూర్‌ 'కబీర్‌ సింగ్‌' టైటిల్‌ తో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. సినిమా విడుదల నేపథ్యంలో షాహిద్‌ కపూర్‌ వరుసగా మీడియూ సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. తాజాగా ఈయన నేహా ధూపియా నిర్వహిస్తున్న టాక్‌ షో లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా తన వైవాహిక జీవితం గురించిన విషయాలను షాహిద్‌ కపూర్‌ నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు.

షాహిద్‌ కపూర్‌ మాట్లాడుతూ.. అందరు భార్య భర్తల మాదిరిగానే తాను మరియు మీరా గొడవ పడుతూ ఉంటాం. మా ఇద్దరి మద్య రెండు మూడు నెలలకు ఒకసారి అయినా ఏదో ఒక గొడవ పెద్దగానే జరుగుతుంది. అలా గొడవ జరిగినప్పుడు ఇద్దరం కూడా 15 రోజుల పాటు మాట్లాడుకోకుండా దూరంగా ఉంటాం. ఆ తర్వాత ఇద్దరిలో ఎవరో ఒకరం సర్దుకు పోయి మాట్లాడేస్తాం.

ఒకసారి మాట్లాడుకున్న తర్వాత మళ్లీ మామూలే. మళ్లీ కొన్నాళ్లకు గొడవ పడుతూ ఉంటాం. భార్య భర్తలు అన్నప్పుడు అప్పుడప్పుడు గొడవ పడితేనే భాగస్వామి గురించి పూర్తిగా అర్ధం చేసుకునే వీలుంటుందని షాహిద్‌ కపూర్‌ కొత్త సంసార సూత్రంను చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News