కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో చాలా రకాల ఇన్నర్ థింగ్స్ బయటకు వస్తుంటాయి. రీసెంట్ గా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్- అతని భార్య మీరా రాజ్ పుత్ లతో ఛాట్ షో నిర్వహించాడు ఈ దర్శకుడు. ఈ కార్యక్రమంలో కరణ్ అడిగిన ప్రశ్నలకు.. మీరా ఇచ్చిన ఆన్సర్స్.. అసలు పెళ్లి విషయంలో వారిద్దరి మధ్య జరిగిన ఎపిసోడ్స్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పింది మీరా రాజ్ పుత్.
'ఢిల్లీలో జరిగిన ఓ ప్రైవేట్ డిన్నర్ కార్యక్రమంలో షాహిద్ ఫాదర్ పంకజ్ కపూర్.. ఆయన భార్య సుప్రియా పాఠక్ లు నన్ను కలిశారు. ఆ సమయంలో వారు నన్నెందుకు కలిశారో కూడా తెలుసు. అప్పట్లో నాకు బాలీవుడ్ పై ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇక అరేంజ్డ్ మ్యారేజ్ విషయంలో ఇద్దరికీ సరైన అభిప్రాయం లేకపోవడం అసలైన హైలైట్' అంటూ చెప్పిందామె. 'ఆ తర్వాత షాహిద్ తో కలిసి 7 గంటల పాటు మాట్లాడాల్సి వచ్చింది. మా ఇద్దరిలో కామన్ థింగ్ ఒకటి కూడా లేదని తేలిపోయింది. ఇద్దరం ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాల్సి ఉందని అర్ధమైంది. అందుకే మరోసారి కలుసుకోవాలని నిర్ణయించుకున్నాం' అని చెప్పింది మీరా రాజ్ పుత్.
రెండోసారి మీట్ అయినపుడు 'నీకంటే 13 ఏళ్ల చిన్న వయసు అమ్మాయిని చేసుకోవాలని అనుకోవడం నీకేం అనిపించడం లేదా' అని మీరా రాజ్ పుత్ అడిగేయడం.. షాహిద్ ని బాగా ఇంప్రెస్ చేసేసిందట. ఆ తర్వాత ఆరు నెలలకు అంటే ఉడ్తా పంజాబ్ చేసే సమయంలో.. షాహిద్-మీరాలకు పెళ్లి జరిగింది. ఇక షాహిద్ సినిమాల్లో మీకు నచ్చిన మూవీ ఏది అని కరణ్ జోహార్ అడిగితే.. 'కరీనా కపూర్ తో నటించిన జబ్ వుయ్ మెట్' అని నిర్మొహమాటంగా చెప్పేసింది మీరా చోప్రా. ఆ సినిమాలో నటించే సమయానికి.. కరీనా కపూర్-షాహిద్ కపూర్ లు లవర్స్ అనే సంగతి అందరికీ తెలుసు కదా!