ఈ జెనరేషన్ లో హీరోలకైనా.. హీరోయిన్లకైనా అత్యంత అవసరమైనది పీఆర్. అది సరిగ్గా ఉంటే కెరీర్ కు ఎంతో హెల్ప్ అవుతుంది. పీఆర్ సరిగ్గా లేకపోయినా కెరీర్ ఏమీ క్లోజ్ అవ్వదు కానీ కొంత నష్టం అయితే తప్పనిసరిగా జరుగుతుంది. ప్రస్తుతం హీరోయిన్ షాలిని పాండే అలానే జరుగుతోందనే టాక్ ఉంది.
ఎందుకంటే 'అర్జున్ రెడ్డి' లాంటి సెన్సేషనల్ హిట్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే. అదేంటో కానీ విజయ్ దేవరకొండ కు మేజర్ క్రెడిట్.. మిగతా క్రెడిట్ సందీప్ వంగాకు పోయింది కానీ షాలిని పాండేకు పెద్దగా క్రెడిట్ రాలేదు. అయినా షాలిని నటన సూపర్ అనే మాట నిజం. విజయ్ దేవరకొండ కు పోటీగా నటించి అందరినీ మెప్పించింది. అయినా పెద్దగా క్రెడిట్ దక్కకపోవడం ఆశ్చర్యమే. ఆ సినిమాతో కొన్ని ఆఫర్లు వచ్చాయి కానీ అవన్నీ క్రేజీ అఫార్లయితే కాదు. ఇదిలా ఉంటే 'అర్జున్ రెడ్డి' హిందీ వెర్షన్ 'కబీర్ సింగ్' ఇప్పుడు సూపర్ హిట్ అయింది. హిందీ వెర్షన్ చూసిన వాళ్ళు కూడా కొందరు ఇప్పటికీ విజయ్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఒక్కరు కూడా షాలిని పేరెత్తడం లేదు.
అది సరే.. ఇటు షాలిని కూడా 'కబీర్ సింగ్' పై ఏమాత్రం స్పందించలేదు. 'కబీర్ సింగ్' షూటింగ్ లో ఉండే సమయంలో దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు సినిమా హిట్ అయిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడలేదు. సినిమా బాగుందని తన సోషల్ మీడియా ఖాతాలో ఒక్క పోస్ట్ పెట్టినా చాలు పెద్ద న్యూస్ అయి ఉండేది. కానీ అది చేయకుండా ఇన్స్టా ఖాతా ద్వారా తన గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేసుకుంటూ ఉంది. ఫ్రీ గా పబ్లిసిటీ వచ్చే అవకాశాన్ని చేజార్చుకోవడం అంటే ఇదే.
విజయ్ మాత్రం అందుకు భిన్నంగా తరచుగా 'కబీర్ సింగ్' గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సినిమా రిలీజ్ తర్వాత 'కబీర్ సింగ్' టీమ్ ను మెచ్చుకున్నాడు.. అంతే కాదు వారికి బహుమతులు కూడా పంపి నేషనల్ లెవెల్ లో వార్తల్లో నిలిచాడు. ఇదే పని షాలిని చేయలేకపోయింది. దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే.. పాప పీఆర్ చాలా వీక్ గా ఉంది. సక్సెస్ ను క్యాష్ చేసుకోవడం తెలియకపోతే ఎలా?