బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ తెలుగు రీమేక్ తో పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. పింక్ స్క్రిప్ట్ లో పలు మార్పులు చేర్పులు చేసి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చి వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో కీలక పాత్రకు గాను శృతి హాసన్ ను తీసుకున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. ఆమద్య తాను వకీల్ సాబ్ సినిమాలో నటించడం లేదని శృతి హాసన్ వ్యాఖ్యలు చేసిందనే సోషల్ మీడియా పుకార్లు వినిపించాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ వకీల్ సాబ్ చిత్రంలో తాను నటిస్తున్న మాట వాస్తవమే. కాని ఏ పాత్ర ఎంత నిడివి ఉండే పాత్ర అనేది ఇప్పుడే చెప్పలేను. పవన్ కళ్యాణ్ గారితో మళ్లీ నటించడం మాత్రం వాస్తవమే అంటూ క్లారిటీ ఇచ్చింది. హీరోయిన్ గానే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న ఎలాంటి పాత్రలనైనా చేసేందుకు నేను రెడీగా ఉన్నానంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
తనలోని నటిని నిరూపించుకునేందుకు విలన్ పాత్రలను చేసేందుకు ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈమె హిందీలో నటించిన చిత్రం ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది. తెలుగులో ఈమె రవితేజతో కలిసి క్రాక్ చిత్రంలో నటించింది. వెబ్ సిరీస్ ల్లో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రకటించింది. ఇంత బిజీలో పవన్ వకీల్ సాబ్ మూవీలో చిన్న పాత్రను చేసేందుకు ఈ అమ్మడు ఓకే చెప్పడం జరిగింది. శృతి పాత్రతో వకీల్ సాబ్ చిత్రానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జతవ్వుతాయని భావిస్తున్నారు.