విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి రాబోతున్నానంటూ స్పష్టమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో, కమల్ కు ఆయన కుటుంబ సభ్యులు - సన్నిహితులు - అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. మేము సైతం కమల్ అడుగులో అడుగు వేస్తామంటూ ఇప్పటికే పలువురు ప్రకటించారు. తాజాగా, కమల్ పొలిటికల్ ఎంట్రీపై ఆయన కూతురు హీరోయిన్ శ్రుతి హాసన్ స్పందించింది. రాజకీయాల్లో తన తండ్రికి ఫుల్ సపోర్ట్ ఇస్తానని చెప్పింది. తన తండ్రి నిజాయితీపరుడని - ఆయన తప్పక రాజకీయాల్లో రాణిస్తారని తెలిపింది. చెన్నైలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న శృతిహాసన్ కమల్ రాజకీయ అరంగేట్రంపై తొలిసారి మీడియాతో మాట్లాడింది.
తన తండ్రి ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని శ్రుతి హాసన్ చెప్పింది. సినిమాల్లోనే కాదు...నిజ జీవితంలో కూడా ఆయనో గొప్ప నాయకుడని, పాలిటిక్స్ లో తప్పక రాణిస్తారని చెప్పింది. తన తండ్రి నిజాయతీపరుడని - అన్ని విషయాల్లో ముక్కు సూటిగా మొహమాటం లేకుండా మాట్లాడేస్తారని కితాబిచ్చింది. ఆయన ఏ పని చేసినా బాగా ఆలోచించి, విశ్లేషించిన తర్వాతే చేస్తారని చెప్పింది. ఆయన చేయబోయే పనిపై ఒక స్పష్టమైన అవగాహన ఉన్నపుడే దానిని ప్రారంభిస్తారని తెలిపింది. ఆయన చేసే ప్రతి పనిలో తన మద్దతు తప్పక ఉంటుందని చెప్పింది. శభాష్ నాయుడు సినిమాలో తండ్రీ కూతుళ్లు కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, కమల్ కు రాజకీయాలలో మద్దతు ఇచ్చే విషయంలో నటి గౌతమి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో సహజీవనం చేసినంత మాత్రాన రాజకీయాల్లో ఆయనకు మద్దతు ఇవ్వాలని లేదని మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే.