హిందీ సినీ జనాల ఆక్రోషం మరోసారి బయటపడింది. దక్షిణాది వారిపై వారికున్న కసి ట్రైలర్ సాక్షిగా తేటతెల్లమైంది. శివసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ థాకారే బయోపిక్ ‘థాకరే’ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో థాకరే పాత్ర ధారి నవాజుద్దీన్ సిద్ధికీ దక్షిణాది వారిని ఉద్దేశిస్తూ పలికిన డైలాగులు దుమారం రేపాయి. దక్షిణాది ప్రజలను కించపరిచేలా పలు డైలాగులును ఆయన పేల్చడంపై దక్షిణాది హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
థాకరే ట్రైలర్ లో హీరో నవాజుద్దీన్ లుంగీ పైకెత్తి... పేర్కొనలేని పదజాలాన్ని ప్రయోగించారు. దక్షిణాది వారిని ఉద్దేశిస్తూ పలికిన ఈ డైలాగులు వివాదాస్పదమయ్యాయి. బాల్ థాకరే బయోపిక్ లో ఇలాంటి సీన్లు చిత్రీకరించడంపై దుమారం రేగుతోంది. దక్షిణాది వారే ఎక్కువగా లుంగీలు - పంచెలు ధరిస్తారు. వారి మనోభావాలు కించపరిచేలా సినిమా ఉందంటూ ఇప్పటికే దక్షిణాదిన చిత్ర పరిశ్రమ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ లో ఈ ట్రైలర్ షేర్ చేసి మండిపడ్డారు. నవాజుద్దీన్ లాంటి నటుడు ఇలాంటి డైలాగులు పేర్కొనడం ఏంటని నిలదీశారు. దక్షిణాది వారిని తిట్టి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. నీచమైన పనులు ఇలాంటివి చేయకండి అంటూ సిద్ధార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర ప్రజల హక్కులు.. ముఖ్యంగా మరాఠీల కోసం వెలిసిన పార్టీ శివసేన. దాన్ని స్తాపించిన బాల్ థాకరే ఇతర రాష్ట్రాల వారిపై - ముస్లిం మైనార్టీలపై అసూయతో ఎన్నో దాడులు చేయించారు. ఆయన జీవిత చరిత్ర మొత్తం వివాదభరితమే.. అలాంటి వ్యక్తి పాత్రలో ముస్లిం నటుడైన నవాజుద్దీన్ నటింపజేయడం ప్లానింగ్ లో భాగమేనని సిద్ధార్థ్ మండిపడ్డారు.
ఇప్పటికే ఈ సినిమా మత - ప్రాంతీయ విద్వేశాలు రెచ్చగొడుతుందని కంప్లైట్లు రావడంతో సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందట.. ఈ నేపథ్యంలో సినిమా విడుదలైతే ఇంకా ఎంత దుమారం సృష్టిస్తుందో చూడాలి మరి.