నాని కోసం త‌ర‌లొచ్చిన సింగరేణి కాల‌రీస్

Update: 2022-05-06 10:30 GMT
నేచుర‌ల్ స్టార్ నాని గ‌త ఏడాది రెండు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. శివ నిర్వాణ తెర‌కెక్కించిన  ఫ్యామిలీ ఎంట‌ర్ టై `ట‌క్ జ‌గ‌దీష్‌` థియేట‌ర్ల‌లో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. ఆ త‌రువాత రాహుల్ సంక్రీత్య‌న్ తో చేసిన `శ్యామ్ సింగరాయ్‌` థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ ఏడాది కూడా నాని రెండు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే వివేక్ ఆత్రేయ‌తో  చేస్తున్న `అంటే సుంద‌రానికి` చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.

జూన్ 10న క‌న్న‌డ మిన‌హా నాలుగు భాష‌ల్లో ఈ మూవీని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత హీరో నాని హై వోల్టేజ్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌ `ద‌స‌రా` లో న‌టిస్తున్నారు. సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ విడుద‌ల కానుంది. సింగ‌రేణి కాల‌రీస్ లో ప‌నిచేసే ఊర మాస్ పాత్ర‌లో నాని క‌నిపించ‌బోతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తోంది.  

తెలంగాణ బ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని కొత్త‌గూడెం సింగ‌రేణి కారీస్ లో ఈ మూవీ షూటింగ్ చేశారు. పాపి, కీర్తి సురేష్ ల‌పై చిత్రీక‌రించిన ఈ పాట‌లో దాదాపు వెయ్యికి పైగా డ్యాన్స‌ర్ లు, జూనియ‌ర్ ఆర్టిస్ట్‌ లు  పాల్గొన్నారు. అయితే సింగ‌రేణి కాల‌రీస్ బొగ్గు గ‌నుల్లో భారీ క్రౌడ్ లో భారీ స్థాయి టీమ్ మెంబ‌ర్స్ తో చేయ‌డం ఇబ్బందిక‌రంగా మారింద‌ట‌. వాతావ‌ర‌ణం ప‌డ‌క‌పోవ‌డంతో చాలా మంది యూనిట్ స‌భ్యులు అనారోగ్యానికి గుర‌య్యార‌ని తెలిసింది. దీంతో తాజా షెడ్యూల్ అక్క‌డే చేయాల్సి వున్నా టీమ్ అంతా హైద‌రాబాద్ కు షిఫ్ట్ అయింద‌ట‌.

ఇక్క‌డే సింగ‌రేణి కాలరీస్ కు సంబంధించిన సెట్ ని ఏర్పాటు చేసి అంతులో మిగ‌తా షూట్ ని పూర్తి చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ ఏస్తున్నార‌ని తెలిసింది. ఇందు కోసం హైద‌రాబాద్ సిటీ ఔట్ ష్క‌ర్ట్స్ లో ప్ర‌త్యేకంగా సింగ‌రేణి కోల్ మైన్స్ సెట్ తో పాటు విలేజ్ సెట్ ని కూడా ఏర్పాటు చేస్తున్నార‌ట‌. ఇందు కోసం భారీ బ‌డ్జెట్ అవుతున్న‌ట్టుగా తెలుస్తోంది. సింగ‌రేణి కాల‌రీస్ వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించేలా బ్లాక్ పౌడ‌ర్‌ని వాడుతున్నార‌ట‌. సెట్ కి భారీగా ఖ‌ర్చు అవుతుండ‌టంతో ఈ సెట్ లో డే అండ్ నైట్ కీల‌క ఘ‌ట్టాల‌ని పూర్తి చేయాల‌ని టీమ్ నిర్ణ‌యించుకుంద‌ని తెలిసింది.  

ఈ మూవీపై హీరో నాని భారీ అంచ‌నాలు పెట్టుకున్నార‌ట‌. క్యారెక్ట‌ర్ బేస్డ్ సినిమా కావ‌డంతో కేజీఎఫ్ లా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. బీడీ కాలుస్తూ 90 ఎం ఎల్ బాటిల్స్ తో గ‌ల్ల లుంగీ..మెడ‌లో హ‌నుమాన్ డాల‌ర్‌తో ఊర మాసీవ్ గా నాని క‌నిపించిన తీరు సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్నారు
Tags:    

Similar News