గత కొన్ని రోజులుగా ప్రముఖ గాయిని శ్రావణ భార్గవి పర్సనల్ యూట్యూబ్ ఛానల్ లోని ఒక పాట కు సంబంధించిన వీడియో వివాదాస్పదం అవుతోంది.
వెంకటేశ్వర స్వామి వారిని అవమానించినట్లు పాట ఉందంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు భక్తి పాట లో రక్తి ఏంటీ ఇదే నా నీ సంస్కారం అన్నట్లుగా విమర్శలు చేస్తున్నారు.
ఒకపరి ఒకపరి వయ్యారమే కీర్తనతో శ్రావణ భార్గవి ఆల్బమ్ చేసింది. ఆ ఆల్బం పై అన్నమయ్య వంశస్థులు మరియు టీటీడీ మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొదట తన వీడియో ను శ్రావణ భార్గవి సమర్థించుకుంది. తన పాటను మరియు అందులో ఉన్న కంటెంట్ ను సమర్ధించుకున్న శ్రావణ భార్గవి ఇప్పుడు ఆ వివాదానికి స్వస్థి చెప్పింది.
అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముడుతున్న నేపథ్యంలో శ్రావణ భార్గవి ఆ వీడియో ను డిలీట్ చేసింది. తన ఉద్దేశ్యం తప్పు కాదని.. ప్రజెంటేషన్ బాగుండాలనే ఉద్దేశ్యంతో అలా చేశాను అంటూ మొదట చెప్పినా కూడా విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె వీడియో ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదం కు దీంతో చెక్ పడ్డట్టు అయ్యింది. ఈ పని ముందు చేసి ఉంటే బాగుండేదని కొందరు అంటూ ఉంటే.. మరోసారి అన్నమయ్య కీర్తలను ఇలా అపహాస్యం చేసినట్లు శ్రావణ భార్గవి ఆలపించి వీడియో చేయదని భావిస్తున్నామని మరి కొందరు అంటున్నారు.