సుప్రీం హీరో సాయి తేజ్ నటించిన తాజా చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్` క్రైసిస్ అనంతరం తొలి క్రేజీ చిత్రంగా థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోందా? మహమ్మారీ భయాల నడుమ జనం థియేటర్లకు వస్తున్నారా? లేదా? అంటే.. ఇదిగో ఈ కలెక్షన్స్ వివరాల్ని పరిశీలించాల్సిందే.
నిజానికి కరోనా భయాల నడుమ ఓపెనింగులపై సందేహాలు నెలకొన్నా.. 1వ రోజు అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది. రెండో రోజు 3.29 కోట్లు వసూలు చేయగా.. మొదటిరోజు కంటే 30 శాతం తక్కువ వసూళ్లను సాధించిందని తెలుస్తోంది. చాలా ప్రాంతాలు ఆదివారం చివరి నాటికి బ్రేక్ఈవెన్ సాధించే వీలుందని తెలిసింది.
50శాతం ఆక్యుపెన్సీతోనే రెండోరోజు వసూళ్లను పరిశీలిస్తే.. నైజాం - 1.19 కోట్లు.. సీడెడ్ - 0.59 కోట్లు.. గుంటూరు - 0.26 కోట్లు.. నెల్లూరు - 0.13 కోట్లు.. కృష్ణ - 0.18 కోట్లు.. ప.గో జిల్లా - 0.15 కోట్లు.. తూ.గో జిల్లా - 0.24 కోట్లు.. వైజాగ్ - 0.55 కోట్లు వసూలైంది. 2వ రోజు మొత్తం గ్రాస్ - 3.29 కోట్లు. రెండు రోజుల మొత్తం - 7.99 కోట్లు వసూలైంది. తాజా సమాచారం మేరకు ఆస్ట్రేలియాలోనూ వసూళ్లు బావున్నాయని తెలిసింది.