మూడు లక్షల మందికి ఉద్యోగాలిస్తా.. సోనూ సూద్ సంచలనం

Update: 2020-07-30 14:30 GMT
చేతికి ఎముకే లేకుండా అడిగిన వారికీ.. అడగని వారికి సాయం చేస్తూ ఒక మినీ ప్రభుత్వం లాగా వ్యవహరిస్తున్నారు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. కరోనా లాక్ డౌన్ వేళ ఎంతోమందిని ఆదుకొని రియల్ హీరో అనిపించుకున్నారు.

అందుకే సోనూ సూద్ బర్త్ డే అయిన ఈరోజున ఆయనకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది ఆయన పుట్టిన రోజున ఘనంగా జరుపుతున్నారు. ఇప్పటికే బర్త్ డే సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలను సోనూ ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే జనాల అభిమానాన్ని చూసి ముగ్దుడైన సోనూ సూద్.. తాజాగా తన బర్త్ డే రోజున మరో కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 3 లక్షలమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు.

‘ప్రవాసీ రోజ్ గార్’ పోర్టల్ ద్వారా నియామకాలు చేపట్టనున్నామని.. ఎంపికైన వారికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పిస్తామని సోనూ వెల్లడించాడు.
Tags:    

Similar News