రివ్యూ తేడా వస్తే సౌందర్య ఏకేస్తోంది

Update: 2016-07-27 07:29 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కబాలి అయింది. నెగిటివ్ టాక్ ఉన్నా తొలి వీకెండ్ లో బాగానే ఫేర్ చేసింది. తమిళ్ లో అయితే.. 10 రోజుల వరకూ అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయ్ కాబట్టి కలెక్షన్స్ కి ఢోకా లేదని అంటున్నారు. అయితే.. రివ్యూల విషయంలో రజినీ కూతురు సౌందర్య రియాక్ట్ అయిన తీరు చాలామందికి మైండ్ బ్లాంక్ చేస్తే.. ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ జోష్ ఇచ్చింది.

థియేటర్ లో మొదటి ఆటపడుతున్నపుడే.. ఫస్ట్ డే ఫస్ట్ షో ట్యాగ్ తో లైవ్ రివ్యూలు రాయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే.. సౌందర్య మాత్రం ఇలా రివ్యూలు రాసిన వాళ్లని లైవ్ లోనే ఏకేసింది. నెగిటివ్ రివ్యూలు రాస్తే ఏ మాత్రం వదల్లేదు. పైగా 'తలైవా ఫ్యాన్స్ తరఫున నా అభిప్రాయం చెప్పానంతే' అంటూ కవరింగ్ కూడా ఇచ్చింది. ఈమె దెబ్బకి రిలీజ్ రోజున లైవ్ రివ్యూలు కూడా ఆపేశాయి కొన్ని సైట్లు.

అయినా మూవీ గురించి బ్యాడ్ టాక్ వస్తుండడంతో ఇలా షార్ప్ గా రియాక్ట్ అయింది కానీ.. ఒకవేళ సూపర్.. కేక అని రాస్తే అప్పుడు కూడా రజినీ కూతురు రియాక్షన్ ఇలాగే ఉండేదా? అంతే కాదండోయ్.. కబాలికి పాజిటివ్ మాట్లాడితే మాత్రం రీట్వీట్ చేసేందుకు వెనకాడకపోవడం విశేషం.
Tags:    

Similar News