మేము ముంబయి వెళ్లేందుకు బాలు గారు బ్లాంక్‌ చెక్‌ పంపించారు

Update: 2020-09-26 17:30 GMT
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతితో ఆయన వల్ల లాభ పడ్డవారు.. ఆయన వల్ల జీవితంలో సెటిల్‌ అయిన వందలాది మంది ఆయన జ్ఞాపకాలతో కన్నీరు పెట్టుకుంటున్నారు. బాలు గారు ఎన్నో సాయాలు చేశారు. అందులో ఒకటి 37 ఏళ్ల క్రితం విశ్వనాథ్‌ ఆనంద్‌ కు చేశారు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్‌ అయిన విశ్వనాథ్‌ ఆనంద్‌ 1983లో జాతీయ స్థాయిలో జరుగుతున్న పోటీలకు గాను ముంబయికి వెళ్లేందుకు డబ్బులు లేక ప్రయాణ ఆలోచన విరమించుకున్నాడట. విశ్వనాథ్‌ ఆనంద్‌ 14 ఏళ్ల వయసులో చెస్‌ లో సాధిస్తున్న విజయాల గురించి తెలుసుకుని బాలు గారు స్వయంగా స్పాన్సర్‌ చేసేందుకు ముందుకు వచ్చారట.

జాతీయ చెస్‌ ఛాంపియన్‌ లో సెలక్ట్‌ అయిన విశ్వనాథ్‌ ఆనంద్‌ టీమ్‌ ముంబయికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు అనే విషయంను ఒక వ్యక్తి ద్వారా తెలుసుకున్న బాలు గారు ఒక బ్లాంక్‌ చెక్‌ ను పంపించారట. బాలు గారి సాయంతో ముంబయి వెళ్లిన విశ్వనాథ్‌ ఆనంద్‌ టీం అక్కడ విజయాన్ని సొంతం చేసుకున్నారట. ఆ విజయంతో విశ్వనాథ్‌ ఆనంద్‌ కు సన్మానం ఏర్పాటు చేయగా ఆ సన్మానంకు బాలు గారు కూడా హాజరు అయ్యి ముందు ముందు విశ్వనాథ్‌ ఆనంద్‌ కు స్పాన్సర్‌ గా వ్యవహరిస్తానంటూ హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న విశ్వనాథ్‌ ఆనంద్‌ ఎమోషనల్‌ అయ్యారు.




Tags:    

Similar News