తెలుగమ్మాయ్‌ కనపడదే???

Update: 2015-06-09 04:06 GMT
తన సినిమాను ఎలాగైనాసరే సూపర్‌ హిట్‌ చేసుకోవాలని తలచిన నిర్మాత దిల్‌ రాజు.. టివి ఛానళ్ళకు యాడ్స్‌ అయితే కట్‌ చేశారు కాని.. సదరు సినిమాను పబ్లిక్‌లోని తీసుకువెళ్ళడానికి మాత్రం కావల్సిన సరుకును బాగానే తయారుచేసుకున్నారు. అసలే ''కేరింత'' అనే యూత్‌ఫుల్‌ సినిమాతో వస్తున్నారు.. అందుకే కాబోలు హ్యాపీగా యూత్‌ మధ్యలోనే కేరింతలు కొడుతున్నారు.

రోజులో షాపింగ్‌ మాల్‌ ఎంచుకొని.. జూన్‌ 12న సినిమా రిలీజ్‌ అయ్యేవరకు ఏదో ఒక చోట తన టీమ్‌తో సందడి చేయాలని ప్లాన్‌ చేశారు దిల్‌ రాజు. అందుకే దర్శకుడు సాయికిరణ్‌ అడవి, తన స్టార్‌ క్యాస్ట్‌ అయిన సుమంత్‌ అశ్విన్‌, తేజస్విని మదివాడ మొదలగురుని తీసుకొని వెళ్లి సందడి చేస్తున్నాడు. వాళ్ళతో ఫ్లాష్‌ మాబ్‌ డ్యాన్సులు కూడా వేయిస్తున్నాడు. బహుశా మన తెలుగు హీరోల్లో ఇలా షాపింగ్‌ మాల్స్‌ గట్రా తిరుగుతూ డ్యాన్సులు వేస్తోంది మనోడే. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మిస్సింగ్‌.

తెలుగు పిల్లే కదా అనుకుంటున్న హీరోయిన్‌ శ్రీదివ్య ఈ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌. అటువంటిది ఆ అమ్మాయ్‌ మాత్రం మొన్నటి ఆడియో ఫంక్షన్‌ కాదు కదా, ఇప్పుడు ఈ ప్రచారంలో కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఏమన్నా అంటే తమిళ సినిమాల్లో బిజీ, డేట్స్‌ లేవు అంటోంది. మన తెలుగు బేబీలకు నాలుగు సినిమాలు దక్కగానే ఇలా ఎక్స్‌ట్రాలు ఎక్కువైపోవడం వలనే తమిళ బేబీలు, మల్లూ కుచ్చీలు, ముంబయ్‌ రసగుల్లాలూ ఇక్కడ హీరోయిన్స్‌గా జండా ఎగరేస్తున్నారు.

Tags:    

Similar News