నాకంత వయసు లేదంటున్న మాజీ హీరోయిన్

Update: 2016-06-30 15:30 GMT
అందాల తార అన్న బిరుదుకు అర్హత ఉన్న ఏకైక నటి.. మాజీ హీరోయిన్‌ శ్రీదేవి. ఆ తర్వాత చాలామంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా.. శ్రీదేవి స్థాయికి ఇంకా ఎదగలేకపోయారు. అంతమంది అభిమానులను సంపాదించుకోలేకపోయారు. నాలుగేళ్ల వయసులోనే సినిమాల్లో నటించడం ప్రారంభించిన ఈ అందాల తార.. నాలుగు దశాబ్దాలకు పైగా ఈ కెరీర్ ని కొనసాగిస్తోంది. మరి ఇంతటి అనుభవజ్ఞురాలికి జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు కదా!

అలా అనుకునే స్పెయిన్ లో రీసెంట్ గా జరిగిన ఐఫా అవార్డుల ఫంక్షన్ లో ఈమెకు లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు ప్రకటించారు. ఈ అవార్డ్ ప్రకటించే ముందు శ్రీదేవి గురించి సోనాక్షి సిన్హా ఓ పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చింది. వీపరీతంగా పొగిడేసింది. ఓ సీనియర్ హీరోయిన్ గురించి.. మరో బ్యూటీ అంతగా పొగుడుతుంటే అందరూ చెవులు రిక్కించి మరీ విన్నారు. చప్పట్లతో ఆడిటోరియం దద్దరిల్లేలా చేశారు. కానీ.. ఇవన్నీ నేరుగా అనుభవించే అవకాశం శ్రీదేవికి లేకపోయింది. ఇందుకు కారణం.. ఆమె అక్కడ లేకపోవడమే.

అసలు ఐఫా అవార్డుల వేడుకకు శ్రీదేవి రానే లేదు. ఇందుకు కారణం.. లైఫ్ టైం ఎఛీవ్మెంట్ అందుకునేంతటి ఏజ్ తనకు ఇంకా రాలేదన్నది శ్రీదేవి అభిప్రాయంగా తెలుస్తోంది. తనకు అంత ఏజ్ రాకుండానే.. ఆ అవార్డ్ అందుకోరాదన్నది ఆమె ఉద్దేశ్యమట. అందుకే ఐఫా వేడుకకు శ్రీదేవి జంప్ ఇచ్చింది. ఇంతకీ ఏజ్ రాలేదు ఏజ్ రాలేదు అంటున్నారు.. మరి శ్రీదేవి ఏజ్ ఎంత అంటారా.. జస్ట్ 52 ఏళ్లే. అప్పుడే లైఫ్ టైం ఎఛీవ్మెంటా! అనుకుంటోది కదూ ఈ అందాల తార.
Tags:    

Similar News