వేలానికి శ్రీదేవి చీర‌లు.. మీకు కావాలా?

Update: 2022-10-14 10:30 GMT
అతిలోక సుంద‌రి శ్రీదేవి కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అన్ని భాష‌ల్లోనూ ప్రేక్ష‌కుల్ని అల‌రించి భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లోనే ఓ పేజీని లిఖించింది. ఎన్నో అవార్డులు..రివార్డుల‌తోనూ అతిలోక సుంద‌రి ఖాతికెక్కారు. ద‌శాబ్ధాల పాటు సాగిన శ్రీదేవి ప్ర‌యాణం ఎంతో ఆస‌క్తిరం..అద్భుతం. కెరీర్ పీక్స్ లో ఉండాగ‌నే బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ ని వివాహం చేసుకుని సినిమాలకు పుల్ స్టాప్ పెట్టారు.

సెకెండ్ ఇన్నింగ్స్  కుటుంబానికే అంకితం చేసారు. అయితే 15 ఏళ్ల గ్యాప్ అనంత‌రం శ్రీదేవి మ‌న‌సు మ‌ళ్లీ సినిమాలు కోరుకోవ‌డంతో బాలీవుడ్ లో 'ఇంగ్లీష్‌..వింగ్లీష్' సినిమాతో కంబ్యాక్ అయ్యారు.   అందులో ఇంగ్లీష్ రాని మ‌హిళ పాత్ర‌లో ఆద్యంతం ఆక‌ట్టుకున్నారు. తాజాగా ఆ సినిమా విడుద‌లై అక్టోబ‌ర్ 5కి ద‌శాబ్దం  పూర్త‌యింది. ఈ సంద‌ర్బంగా 'ఇంగ్లీష్ ..వింగ్లీష్' జ్ఞాప‌కాలు ఎప్ప‌టికి ప‌దిల‌మే అంటూ యూనిట్ ఆ సినిమాలో శ్రీదేవి ధ‌రించిన చీర‌లు వేలం వేయ‌డానికి రెడీ అయింది.

ఈ విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు రాలు గౌర‌వీ షిండే అధికారికంగా తెలిపారు. 'ఆ సినిమా రిలీజ్ త‌ర్వాత శ్రీదేవి న‌ట‌న‌తో పాటు..ఆమె ధ‌రించిన చీర‌ల‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దాంతో శ్రీదేవితో ఓ ఫ్యాష‌న్ షో ఏర్పాటు చేసి ఆ చీర‌ల్ని వేలం వేయాల‌నుకున్నాం. కానీ ఆమె హ‌ఠాత్తుగా మ‌ర‌ణించ‌డంతో అది సాధ్య‌ప‌డ‌లేదు.

ఆ త‌ర్వాత కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల  వ‌ల్ల కొంత ఆల‌స్యం జరిగింది. తాజాగా ఈ సినిమా విడుద‌లై ప‌దేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఆ చీర‌ల్ని వేలం వేయాల‌ని నిర్ణ‌యించాం. ఈ కార్య‌క్ర‌మాన్ని ఆర్గ‌నైజ్ చేసే ఎన్ జీవోల‌తో చ‌ర్చిస్తున్నాం. ఆ వేలంలో వ‌చ్చిన డ‌బ్బుతో  ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా థీమ్ లాగా.. అమ్మాయిల‌ చ‌దువుల‌కు ఖ‌ర్చు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నామ‌ని" తెలిపారు.

శ్రీదేవి చీర క‌ట్టులో ఎంతో అందంగా క‌నిపిస్తారు. అన్ని భాష‌ల్లోనూ శ్రీదేవి అంద‌మైన న‌టిగా ఫేమ‌స్ అవ్వ‌డానికి ఆ చీర‌క‌ట్టు ఓ కార‌ణం. హీరోయిన్ గా న‌టిస్తోన్న క్ర‌మంలో ఆమె చీర‌క‌ట్టుకు ప్ర‌త్యేక అభిమానులుండేవారు. శ్రీదేవి చీర పోస్ట‌ర్ గోడ మీద ప‌డిందంటే అప్ప‌టి యువ‌త‌లో ఒక‌టే ఎగ్జైట్ మెంట్ క‌నిపించేది. ఎంతో మంది మ‌హిళా అభిమానులు ఆమె చీర క‌ట్టును అనుస‌రించేవారు.

స‌రిగ్గా 'ఇంగ్లీష్..వింగ్లీష్' లో మ‌రోసారి అదే చీర‌క‌ట్టును హైలైట్ చేసారు. ఇప్పుడా అందాల న‌టి చీర‌ల్ని వేలం వేయ‌డం విశేషం. మ‌రి వాటిని  ద‌క్కించుకునే అదృష్ట వంతులెవ‌రో? అతిలోక సుంద‌రి పాత‌ చీర‌ల‌కు మాత్రం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంద‌ని భావించొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News