ఆగష్టు -7న శ్రీమంతుడు రిలీజ్. సెప్టెంబర్- 4న రుద్రమదేవి 3డి వస్తోంది. ఈ రెండిటికి మధ్యలో ఆగష్టు మిడిల్ లో కిక్ -2 రిలీజ్ కోసం కళ్యాణ్ రామ్ సన్నాహాలు చేస్తున్నాడు. అంటే ఈ మూడు సినిమాలు కేవలం నెలరోజుల వ్యవధిలోనే రిలీజ్ కి రాబోతున్నాయి. అంటే తెలుగు ప్రేక్షకులకు ఈ నెలరోజులు ఊపిరిసలపనంత వినోదం దొరుకుతుందన్నమాట!
మూడు వారాలుగా బాహుబలి మానియా సాగుతోంది. జనాలు మళ్లీ మళ్లీ టిక్కెట్లు కొని థియేటర్లకు వెళుతున్నారు. అందుకే ఈ సినిమా 430కోట్ల వసూళ్లు సాధించింది ఇప్పటికే. 500కోట్ల క్లబ్ లో చేరడానికి ఇంకెన్నో రోజులు పట్టదు. ఇంకా ఈ సినిమా పలు భాషల్లోకి అనువాదమై రిలీజైతే కచ్ఛితంగా పీకే రికార్డుల్ని కొట్టేస్తుంది. అయితే ఈ హవా ఇలా సాగుతుండగానే తెలుగు సినిమాల జోరు పెరగనుంది. ముందుగా మహేష్ హీరోగా నటిస్తున్న శ్రీమంతుడు అభిమానులకు పండగ చేయనుంది. ఇప్పటికే పాటలతో మెప్పించిన శ్రీమంతుడు పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం పెరిగింది.
ఈ సినిమాలో మహేష్ బైపెప్ చూపిస్తూ స్టయిల్ గా ఓ సైకిల్ నడిపిస్తున్నాడు కదూ.. దాని ఖరీదు అక్షరాలా 5లక్షలు. అంటే ఓవరాల్ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారో అంచనా వేయొచ్చు. దాదాపు 40 నుంచి 50కోట్లు ఖర్చు చేశారని చెబుతున్నారు. అలాగే గుణశేఖర్ దర్శకత్వం వహించిన రుద్రమదేవి 3డి సెప్టెంబర్ 4న రిలీజ్ కి వస్తోంది. ఇందులో అనుష్క, రానాలతో పాటు గోనగన్నారెడ్డి పాత్రలో బన్ని నటించాడు. ఈ సినిమాలో ఉపయోగించిన భారీ కాస్ట్యూమ్స్, సెట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దేశంలోనే తొలి హిస్టారికల్ 3డి స్కోపిక్ చిత్రమిదని ప్రచారం చేస్తున్నారు. 70 నుంచి 80కోట్ల పెట్టుబడితో తెరకెక్కిన విజువల్ ట్రీట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రుద్రమదేవిగా అనుష్క ఎలా కనిపించబోతోందా? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
అలాగే రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కిక్ 2 తెరకెక్కుతోంది. కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి నిర్మాత. కిక్ చిత్రానికి ఇది కొనసాగింపు చిత్రం. ఇప్పటికే పాటలు విజయం సాధించాయి. ట్రైలర్ కి స్పందన బావుంది. కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి రాజీ లేకుండా పెట్టుబడులు పెట్టారు. దాదాపు 30 నుంచి 40కోట్లు పెట్టుబడిగా పెట్టారని ప్రచారం సాగుతోంది. రేసుగుర్రం తర్వాత సూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా కాబట్టి కిక్2 పైనా భారీ అంచనాలున్నాయి. ఏదేమైనా ఈ నెలరోజులు తెలుగు ప్రేక్షకులకు కన్నుల పండువే. గెట్ రెడీ ఫోక్స్